Cong-JMM Touches Majority Mark: మెజార్టీని దాటేసిన కాంగ్రెస్ - జేఎంఎం కూటమి, బీజేపీకి షాకిస్తున్న ఫలితాలు, హేమంత్ సోరేన్ ముఖ్యమంత్రి అవుతారన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, గెలుపు మాదే అంటున్న బీజేపీ

ఎవరికి వారే గెలుపు ధీమాలో ఉన్నారు. అయితే ఫలితాలు వెలువడేకొద్దీ బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ - జేఎంఎం కూటమి గెలుపు దిశగా (Cong-JMM Touches Majority Mark) దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 42 మంది సభ్యుల మద్దతు అవసరం.

Jharkhand CM candidate BJP's Raghubar Das and JMM's Hemant Soren. (Photo Credit: Facebook)

Ranchi, December 23: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ( Jharkhand Assembly Election Results 2019)తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఎవరికి వారే గెలుపు ధీమాలో ఉన్నారు. అయితే ఫలితాలు వెలువడేకొద్దీ బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ - జేఎంఎం కూటమి గెలుపు దిశగా (Cong-JMM Touches Majority Mark) దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 42 మంది సభ్యుల మద్దతు అవసరం.

ప్రస్తుతం జేఎంఎం - కాంగ్రెస్ కూటమి (Cong-JMM) 44 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. బీజేపీ 26 (BJP), ఏజేఎస్ యూ 4, జేవీఎం 3, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ 42, జేఎంఎం 19, జేవీఎం 8, కాంగ్రెస్ 6, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు.ఈ నేపథ్యంలో అతిపెద్ద పార్టీగా జేఎంఎం అవతరించనుంది.

ఇటీవలి పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, (Citizenship Amendment Act 2019)అంతకుముందు తెరపైకి వచ్చిన జాతీయ పౌరగణన అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా మారినట్లుగా తెలుస్తోంది. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నట్టుగా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఓబీసీ ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫర్వాలేదనిపించిన బీజేపీ, ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ వెనుకంజలో ఉంది.

ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వంపైనా ఉన్న వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందనే చెప్పాలి. ఇక ముస్లిం, ఎస్టీల ఓట్లు కాంగ్రెస్, జేఎంఎం కూటమికి వరంగా మారి అధికారాన్ని దగ్గర చేశాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Here's ANI Tweet

గెలుపు దిశగా పయనిస్తున్న కాంగ్రెస్ కూటమి నేతలు (Congress-JMM alliance) సంబరాల్లో మునిగిపోయారు. మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ముందుగా చేసుకున్న ఘట బంధన్ ఒప్పందం ప్రకారం, మాజీ సీఎం హేమంత్ సోరెన్ మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఆయన ఒక స్థానంలో స్పష్టమైన ఆధిక్యంలో గెలుపు దిశగా వెళుతున్నప్పటికీ, రెండో చోట మాత్రం వెనుకంజలో ఉన్నారు.

గెలుపు మాదే : ముఖ్యమంత్రి రఘబర్‌దాస్‌

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా పాలక బీజేపీ గెలుపుపై భరోసా వీడలేదు. బీజేపీ నేతృత్వంలోనే జార్ఖండ్‌లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి రఘబర్‌దాస్‌ (CM Raghubar Das)విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా చాలా రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాల్సిన క్రమంలో ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయలేమని చెప్పుకొచ్చారు. ఆధిక్యాలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటి మధ్య దోబూచులాట నెలకొందని, ఇప్పుడు మీరు చూస్తున్న లీడ్స్‌ ఏ క్షణమైనా తారుమారు కావచ్చని ఆయన పేర్కొన్నారు. తుది ఫలితాలు వెల్లడైన తర్వాత తమకు స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గెలుపుపై భరోసా వీడని బీజేపీ

ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్న వాళ్లను చేసుకోనివ్వండి..ఒకరు వేడుక చేసుకుంటుంటే ఎవరూ ఆపబోరని వ్యాఖ్యానించారు. సీఎం మాట్లాడిన సమయంలో మొత్తం 81 స్ధానాలకు గాను బీజేపీ 28 స్ధానాల్లో ముందంజలో ఉండగా, జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి 42 స్ధానాల్లో ముందంజలో ఉండి మేజిక్‌ ఫిగర్‌ (41)ను అందుకుంది. విపక్ష కూటమి విజయంతో జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ జార్ఖండ్‌ సీఎం పగ్గాలు చేపడతారని కూటమి నేతలు స్పష్టం చేశారు.

Hemant Soren will be CM candidate of our alliance: RPN Singh 

హేమంత్ సోరేన్ జార్ఖండ్ సీఎం : ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్

జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో మహాఘట బంధన్ అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తుందని ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరేన్ జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపడుతారని ఆయన స్పష్టం చేశారు. హేమంత్ సోరేన్ నాయకత్వంలో ఈ ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. దుమ్కా నియోజకవర్గంలో హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు.