Who Is Jyotiraditya Scindia: ఎవరీ జ్యోతిరాదిత్య సింధియా, ఎందుకు కమల్ నాథ్ సర్కార్‌ని వణికిస్తున్నాడు, బీజేపీతో సింధియాకు లింకేంటి?, సింధియా పూర్తి ప్రొఫైల్‌పై విశ్లేషణాత్మక కథనం
సుస్థిరంగా ఉన్న కమల్ నాథ్ సర్కార్ ను కూల్చేందుకు తన ఎమ్మెల్యేలతో రెడీ అయ్యారు. ప్రధాని మోదీని (PM Modi) కలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ సంక్షోభానికి తెరలేపారు. ఇంతకీ ఎవరీ సింధియా (Jyotiraditya Scindia Profie), బీజేపీకి (BJP) అతనికి ఉన్న లింకేంటి ? ఓ సారి చూద్దాం.
New Delhi, Mar 10: మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ సర్కార్‌ని ( MP Chief Minister Kamal Nath) భయపెడుతున్న ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియానే (Jyotiraditya Scindia). సుస్థిరంగా ఉన్న కమల్ నాథ్ సర్కార్ ను కూల్చేందుకు తన ఎమ్మెల్యేలతో రెడీ అయ్యారు.
ప్రధాని మోదీని (PM Modi) కలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ సంక్షోభానికి తెరలేపారు. ఇంతకీ ఎవరీ సింధియా (Jyotiraditya Scindia Profie), బీజేపీకి (BJP) అతనికి ఉన్న లింకేంటి ? ఓ సారి చూద్దాం.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్, కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా
దేశంలోనే అత్యంత ధనవంతులైన మంత్రులలో సింధియా ఒకరు. జ్యోతిరాదిత్య సింధియా మాధవ్‌రావ్ సింధియా, మాధవి రాజే సింధియా దంపతులకు ముంబై నగరంలో 1జనవరి 1971లో జన్మించారు. ఇతని తాత గారు గ్వాలియర్ మహారాజు జీవాజీరావ్ సింధియా. స్కూలు విద్యను ముంబైనగరంలోని కాంపియన్ స్కూల్ లో కంప్లీట్ చేశాడు.
ఆ తర్వాత డెహ్రడూన్‌లోని డూన్ స్కూల్లో పదవతరగతి వరకు చదువుకున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ, స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. 1994లో మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు మహానార్యమన్, కుమార్తె ఉన్నారు.
సంక్షోభంపై షాకిచ్చిన కమల్ నాథ్ సర్కార్
మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాధవ్‌రావ్ సింధియా విమాన ప్రమాదంలో మరణించారు. తండ్రి మాధవరావు సింధియా మరణంతో జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాలలోకి ప్రవేశించారు. 2001 డిసెంబర్ 18న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2002లో తండ్రి మరణంతో ఖాళీ పడ్డ గుణ నియోజకవర్గం బై ఎలక్షన్‌లో ఎంపీగా గెలుపొందారు.
2008లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా, 2009లో స్టేట్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2013 మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టారు. అక్కడి నుంచే సింధియాకు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది.
అవిశ్వాస తీర్మానపు వ్యూహంలో బీజేపీ, అత్యవసరంగా సోనియా గాంధీతో భేటీ అయిన మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్
2018 ఎన్నికల తర్వాత సీఎం పోటీ విషయంలో జ్యోతిరాధిత్య సింధియా, కమల్‌నాథ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే సింధియా అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించటంతో ముఖ్యమంత్రి పదవి కమల్ నాథ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సింధియా కాంగ్రెస్ పార్టీతో అంటీఅంటనట్లుగా ఉన్నారు. పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి తోడు సింధియాను రాజ్యసభకు పంపాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తే దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది.
ఆయన స్థానంలో ప్రియాంకను నామినేట్ చేయాలని మరో వర్గం కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసంతృప్తికి లోనైన సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరుకు మధ్యప్రదేశ్ రాజకీయాలను చేర్చాడు. ఇప్పుడు రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రెడీ అయ్యారు.
ఇదిలా ఉంటే సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్ సంఘ్ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు.1971 ఎన్నికల్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని జనసంఘ్ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు.
దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను జైలుకు కూడా వెళ్లారు. ఆ తరువాత మారిన పరిస్థితుల్లో మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు.
కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్తాన్ మాజీ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ కుటుంబం మీద ఉన్న ప్రేమ కారణంగా సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు.
సింధియాపై వివాదాలు కూడా ఉన్నాయి. తండ్రి మాధవ్‌రావ్ సింధియాకు చెందిన 20వేల కోట్ల అస్తి తనకే చెందాలని జ్యోతిరాదిత్య సింధియా కోర్టులో కేసువేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ జ్యోతిరాదిత్య మేనత్తలు కోర్టులో కేసు వేశారు. దీంతో పాటుగా దళిత నేతకు అవమానం జరిగేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీజేపీ నేత నంద కుమార్ సింగ్ చౌహాన్ జ్యోతిరాదిత్య సింధియాపై కేసు పెట్టారు.