Maharashtra Government: కీలక శాఖలన్నీ ఎన్పీపీ గుప్పెట్లో..,కలకలం రేపుతున్న రాజీనామాలు, ఆర్థిక శాఖతో అజిత్ పవార్, పర్యాటక శాఖతో ఆదిత్య ఠాక్రే, హోం మంత్రిత్వ శాఖతో దేవ్ ముఖ్, మొత్తం మంత్రిత్వ శాఖల లిస్ట్ ఇదే..

సీఎం ఉద్దవ్‌ ఠాక్రే (Chief Minister Uddhav Thackeray)పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ(Maharashtra Governor Bhagat Singh Koshyari) ఆమోదం తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు (Deputy CM Ajit Pawar) ఆర్థికశాఖ, అనిల్‌ దేవ్‌ముఖ్‌కు హోం మంత్రిత్వశాఖ, సుభాష్‌ దేశాయ్‌కు పరిశ్రమలను కేటాయించారు.

Maharashtra Chief Minister Uddhav Thackeray presides over the first Cabinet meeting in Mumbai (Photo Credits: IANS)

Mumbai, January 5: మహారాష్ట్రలో మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలోని (Maha Vikas Aghadi)మంత్రులకు ఎట్టకేలకు శాఖలు కేటాయించారు. సీఎం ఉద్దవ్‌ ఠాక్రే (Chief Minister Uddhav Thackeray)పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ(Maharashtra Governor Bhagat Singh Koshyari) ఆమోదం తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన శాఖల అప్పగింత అంకం ముగిసింది. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు (Deputy CM Ajit Pawar) ఆర్థికశాఖ, అనిల్‌ దేవ్‌ముఖ్‌కు హోం మంత్రిత్వశాఖ, సుభాష్‌ దేశాయ్‌కు పరిశ్రమలను కేటాయించారు.

మైనింగ్‌-మరాఠీ శాఖలు, ఏక్‌నాథ్‌ షిండేకు పట్టణాభివృద్ధిశాఖ, ఆదిత్య ఠాక్రేకు( Aaditya Thackeray) పర్యాటకం, పర్యావరణం, ప్రోటోకాల్‌ శాఖలు, బాలాసాహెబ్‌ థోరట్‌కు రెవెన్యూశాఖను, జయంత్‌ పాటిల్‌కు (Jayant Patil)జలవనరులు శాఖ బాధ్యతలను అప్పగించారు.ఎవరికీ కేటాయించని శాఖలను సీఎం స్వయంగా పర్యవేక్షించనున్నారు.

‘మహా’లో మొదలైన ముసలం, ఎన్సీపీ ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

సీఎం  చేతిలోని శాఖలు ఇవే 

కాగా సీఎం ఉద్దవ్‌ ఠాక్రే డిసెంబర్‌ 30న 36 మంది మంత్రులతో మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే.ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్‌ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. అయితే ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ ఎన్సీపీకే దక్కినట్లు తెలుస్తోంది.

300 మంది రైతుల ఆత్మహత్యలు, మహారాష్ట్రలో అధికార కుమ్ములాటకు బలైన కర్షకులెందరో

మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు:

ఎన్సీపీ- ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌: ఆర్థిక శాఖ, ప్రణాళికా శాఖ

ఎన్పీపీ అనిల్ దేశ్‌ముఖ్‌: హోం శాఖ

ఎన్పీపీ-జయంత్ పాటిల్ -జలవనరులు

ఎన్సీపీ - ఛగన్ భుజ్‌భల్‌ : ఆహార, పౌర, వినియోగదారుల పరిరక్షణ శాఖ

ఎన్సీపీ- జితేంద్ర -హౌసింగ్

ఎన్సీపీ - ధనుంజయ ముండే -సోషల్ జస్టీస్ శాఖ

ఎన్సీపీ - దిలీప్ వాల్సే పాటిల్ - ఎక్స్చైజ్ అండ్ లేబర్

ఎన్సీపీ - రాజేంద్ర సిగ్నే - ఫుడ్ అండ్ డ్రగ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్

ఎన్సీపీ - రాజేష్ తొపే - ఆరోగ్య శాఖ

నవాబ్ మాలిక్‌ : మైనారిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ

--------

శివసేన- ఏక్‌నాథ్ షిండే : పట్టణాభివృద్ధి శాఖ

శివసేన- దాదాజీ భూసే - వ్యవసాయం

శివసేన- ఉదయ్ సమంత్-హైయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్

శివసేన-అనిల్ పరబ్-ట్రాన్స్‌పోర్ట్, పార్లమెంటరీ వ్యవహారాలు

శివసేన-సుభాష్ దేశాయ్ - పరిశ్రమలు

శివసేన-సంజయ్ రాథోడ్ - అటవీ శాఖ

శివసేన-సందీపన్ రావు భుమ్రే - ఈజీఎస్

శివసేన-శంకర్‌రావు గడ్కే - వాటర్ కన్సర్వేషన్

శివసేన-గులాబ్ రావు పటేల్ - వాటర్ సప్లయి

శివసేన- ఆదిత్య ఠాక్రే : పర్యావరణం, టూరిజం శాఖ

శంకర్‌రావు గడఖ్‌ : ఇరిగేషన్ శాఖ

------------

కాంగ్రెస్ - నితిన్ రౌత్ - విద్యుత్ శాఖ

కాంగ్రెస్ - వర్ష గైక్వాడ్ - స్కూల్ ఎడ్యుకేషన్

కాంగ్రెస్ - సునీల్ కేదార్- డెయిరీ డెవలప్ మెంట్

కాంగ్రెస్ - యశ్మోతీ ఠాకూర్ - ఉమెన్ ,ఛైల్ట్ వెల్ఫేర్

కాంగ్రెస్ - కెసి పడ్వి - ట్రిబల్ డెవలప్ మెంట్

కాంగ్రెస్ - అమిత్ దేశ్‌ముఖ్ -హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్

కాంగ్రెస్ - విజయ్ వదేట్టివర్- ఓబీసీ వెల్ఫేర్

కాంగ్రెస్ - అస్లాం షేక్ - టెక్స్ట్ టైల్స్ , ఫోర్ట్

కాంగ్రెస్ -అశోక్ చవాన్‌ : ప్రజాపనుల శాఖ (పబ్లిక్ వర్క్స్)

కాంగ్రెస్ - బాలా సాహెబ్‌ తోరత్‌: రెవెన్యూ శాఖ

కాగా జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఇన్ఫర్మేషన్‌ మరియు టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ & పబ్లిక్‌ రిలేషన్స్‌, న్యాయశాఖ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే వద్ద ఉండగా, ఇక ఇతర మంత్రులకు శాఖలు కేటాయించాల్సి ఉంది.

Here's ANI tweet

అబ్దుల్‌ సత్తార్‌ రాజీనామా కలకలం

ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. శివసేన నేత అబ్దుల్‌ సత్తార్‌ తనకు కేటాయించిన సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. సోమవారం నాటి క్యాబినెట్‌ విస్తరణలో ఆయనకు సహాయ మంత్రి పదవి దక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి శివసేనలో చేరిన సత్తార్‌, క్యాబినెట్‌ మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. సత్తార్‌ రాజీనామా తమకు అందిందని, పార్టీ దీనిని పరిశీలిస్తున్నదని శివసేన సీనియర్‌ నేత ఏక్నాథ్‌ షిండే తెలిపారు.

ఉద్ధవ్‌తో మాట్లాడిన తర్వాతే వెల్లడిస్తా: సత్తార్‌

పార్టీ అధినేత, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను ఆదివారం కలుస్తానని, ఆ తర్వాతే తన రాజీనామా గురించి వెల్లడిస్తానని అబ్దుల్‌ సత్తార్‌ తెలిపారు. సహాయ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్లుగా వస్తున్న వదంతుల గురించి మీడియా ప్రశ్నించగా ఈ మేరకు సమాధానమిచ్చారు.

Here's Tweet

సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆయనతో ఫోన్‌లో మాట్లాడారని, ఆదివారం ముంబైకి రావాలని పిలిచారని ఉదయం సత్తార్‌ ఇంటికి వెళ్లిన పార్టీ నేత ఖోట్‌కర్‌ తెలిపారు. మరోవైపు సత్తార్‌ మోసగాడని, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఆయన మద్దతుదారులు సహకరించలేదని ఔరంగాబాద్‌కు చెందిన శివసేన సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ఖైరే ఆరోపించారు.

పార్టీకి రాజీనామా చేస్తా: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

పార్టీకి రాజీనామా చేస్తానని జాల్నా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కైలాశ్‌ గోరన్తియల్‌ తెలిపారు. క్యాబినెట్‌ విస్తరణలో మంత్రి పదవి దక్కకపోవడంపై ఆగ్రహంతో ఉన్న ఆయన శనివారం జరిగిన జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.