Another Twist In 'MAHA' Politics: తీవ్ర ఉత్కంఠలో మహా రాజకీయాలు,కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అరవింద్ సావంత్, ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగే ఆలోచనలో శివసేన, ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహాలు
బీజేపీ-శివసేనల మధ్య ఉన్న దశాబ్దాల బంధానికి రారాం చెప్పే విధంగా ముందుకు సాగుతున్నాయి. మహారాష్ట్రలో అధికార ఏర్పాటులో బీజేపీకి-శివసేన కూటమి మధ్య సయోధ్య కుదరకపోవడంతో వార్ మరింతగా వేడెక్కింది.
Mumbai, November 11: మహా రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. బీజేపీ-శివసేన(BJP-Shivsena)ల మధ్య ఉన్న దశాబ్దాల బంధానికి రారాం చెప్పే విధంగా ముందుకు సాగుతున్నాయి. మహారాష్ట్ర(Maharashtra)లో అధికార ఏర్పాటులో బీజేపీకి-శివసేన కూటమి మధ్య సయోధ్య కుదరకపోవడంతో వార్ మరింతగా వేడెక్కింది. శివసేన ప్రకటించిన 50-50 ఫార్ములాకి బీజేపీ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు(Maharashtra Govt Formation)కు మద్ధతు ఇవ్వలేమని శివసేన స్పష్టం చేసింది. అధికారాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన వ్యూహాలు
దీంతో ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని తేల్చి చెప్పింది. ఇక రెండవ పెద్ద పార్టీగా అవతరించిన శివసేనను అధికారం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరడంతో శివసేన ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అంటూ పోస్టర్
ఈ పరిణామాల మధ్య కేంద్రమంత్రి పదవికి అరవింద్ సావంత్(Shiv Sena MP Arvind Sawant) రాజీనామా చేశారు. మహారాష్ట్రలో శివసేన- ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో.. అరవింద్ సావంత్ మోదీ కేబినెట్ నుంచి వైదొలిగారు. అయితే కేంద్ర కేబినెట్‌లో శివసేన నుంచి మంత్రిగా ఉన్నది) ఆయన ఒక్కరే కావడం విశేషం. క్లైమాక్స్‌లో మహారాష్ట్ర పొలిటికల్ ఎపిసోడ్
ఎంపీ పదవికి అరవింద్ రాజీనామా
కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ మద్దతు కావాలంటే ఎన్డీయే నుంచి వైదొలగాని ఎన్సీపీ కండీషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో సావంత్ తన పదవికి రాజీనామా(Shiv Sena MP Arvind Sawant to quit as Union minister చేశారు. మోడీ క్యాబినెట్లో అరవింద్ సావంత్ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ విఫలమైతే శివసేన రెడీగా ఉంది
తామెందుకు ఇంకా ఢిల్లీలో ఉండాలి. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి.. మోడీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నా’ అంటూ సోమవారం ఉదయం అధికారికంగా ఆయన ప్రకటించారు. దీంతో ముంబైతో పాటు ఢిల్లీ రాజకీయాలు సైతం ఒక్కసారిగా వేడెక్కాయి.
ప్రభుత్వ ఏర్పాటులో తాము మద్దతు తెలపాలంటే శివసేన ఎన్డీయే కూటమి నుంచి పూర్తిగా బయటకు రావాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ షరతు పెట్టారు. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, పలువురు సీనియర్లతో చర్చించారు.
చివరికి వారి అంగీకారంతోనే పదవులకు రాజీనామా చేస్తున్నారు. అలాగే తాము ఎన్డీయే కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు త్వరలోనే శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రకటిస్తారని ముంబై వర్గాల సమాచారం.శివసేన–ఎన్సీపీ సంకీర్ణానికి కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇది కేంద్రం ఘనత కానేకాదు, రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని ఎప్పుడో కోరాం
అయోధ్యలో రామమందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా
అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు, అయోధ్య ట్రస్టుకు వివాదాస్పద భూమిని కేటాయించాలి
అయోధ్య కేసులో ఆది నుంచి ఏం జరిగింది?