Mamata Banerjee Swearing-in Ceremony: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం, బెంగాలీలో ప్రమాణస్వీకారం చేసిన దీదీ, కొత్తగా ఎన్నికైన సభ్యులు మే 6 న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం
కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఆమెచేత ప్రమాణ స్వీకారం చేయించారు. కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమం (Mamata Banerjee Takes Oath As the Chief Minister of West Bengal ) చాలా సాదాసీదాగా జరిగింది.
Kolkata, May 5: టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం (Mamata Banerjee Swearing-in Ceremony) చేశారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఆమెచేత ప్రమాణ స్వీకారం చేయించారు. కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమం (Mamata Banerjee Takes Oath As the Chief Minister of West Bengal ) చాలా సాదాసీదాగా జరిగింది.
కోవిడ్ వ్యాప్తి కారణంగా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు.దీదీ బెంగాలీలో ప్రమాణస్వీకారం చేశారు. అంతకుమందు పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం అనంతరం టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ విలేకరులతో మాట్లాడుతూ... కొత్తగా ఎన్నికైన సభ్యులు మే 6 న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.
బెంగాల్‌లో భారీ హింసాకాండ, ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని
కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 292 సీట్లలో 213 సీట్లను గెలుచుకున్న టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. 77 స్థానాలను బీజెపీ గెలుచుకుంది.
Here's Mamata Banerjee takes oath as the Chief Minister Update
పశ్చిమ బెంగాల్ 17 వ అసెంబ్లీ నాయకురాలిగా మమతా బెనర్జీని ఎన్నుకున్నట్లు టీఎంసీ పార్టీ నుంచి సమాచారం వచ్చిన తరువాత, మే 5 న ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బెనర్జీని రాజ్ భవన్‌కు ఆహ్వానించామని గవర్నర్ అని ధన్‌కర్ ట్వీట్ చేశారు. కాగా తృణమూల్ ఎమ్మెల్యేలు ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ విమన్ బెనర్జీని కొత్త అసెంబ్లీ యాక్టింగ్ స్పీకర్‌గా ఎన్నుకున్నారు.