Tripura New CM: ఇంకో ఏడాదిలో ఎన్నికలుండగా సీఎం మార్పు, త్రిపురలో వ్యూహం మార్చుతున్న బీజేపీ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి సీఎం పదవి అప్పగింత, పాత సీఎంపై వ్యతిరేకతే కారణమనే వాదన
నూతన సీఎంగా మాణిక్ సాహాను బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs) ఎన్నుకున్నారు. త్రిపుర బీజేపీ శాఖ అధ్యక్షుడుగా (BJP President) ఉన్న మాణిక్ సాహా (Manik Saha) నూతన సీఎంగా ఎన్నికయ్యారు. శనివారం బిప్లవ్ దేవ్ (Biplab Kumar Deb) సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు
Agartala May 14: త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా (Manik Saha) ఎన్నికయ్యారు. నూతన సీఎంగా మాణిక్ సాహాను బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs) ఎన్నుకున్నారు. త్రిపుర బీజేపీ శాఖ అధ్యక్షుడుగా (BJP President) ఉన్న మాణిక్ సాహా (Manik Saha) నూతన సీఎంగా ఎన్నికయ్యారు. శనివారం బిప్లవ్ దేవ్ (Biplab Kumar Deb) సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. నిన్న అమిత్ షాను బిప్లవ్ దేవ్ కలిశారు. హైకమాండ్ ఆదేశాలతో బిప్లవ్ దేవ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. బిప్లవ్ దేవ్ (Biplab Kumar Deb) రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తన శాసనసభా పక్ష నేతగా మాణిక్ సాహాను ఎన్నుకున్నారు.
మాణిక్ సాహా వృత్తిరీత్యా దంత వైద్యుడు. ఈ ఏడాది త్రిపుర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2020లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మాణిక్ సాహా త్రిపుర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. క్రియా శీల రాజకీయాల్లోకి రాకముందు హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఏడాదిలోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా త్రిపుర రాష్ట్రానికి బీజేపీ నూతన సీఎంను ఎంచుకోవడం గమనార్హం.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చలేరన్న సందేహంతోనే బిప్లవ్‌దేవ్ స్థానంలో మాణిక్ సాహాను నియమించినట్లు తెలుస్తోంది. త్రిపుర సీఎంగా బిప్లవ్‌దేవ్ కుమార్ రాజీనామా చేయడంతో ఆయన వారసుడిగా డిప్యూటీ సీఎం త్రిపుర రాజ వంశ వారసుడు జిష్ణుదేవ్ వర్మను ఎంపిక చేస్తారని అందరూ భావించారు. కానీ మాణిక్ సాహాను ఎన్నుకున్నారు. బీజేపీలో అంతర్గత విబేధాల వల్లే ప్రభుత్వానికి కొత్త సారధిని ఎంపిక చేశారని విమర్శలు ఉన్నాయి.