Manipur Assembly Election Results 2022: మణిపూర్‌లో కమలం Vs కాంగ్రెస్‌, మళ్లీ అధికారంలోకి బీజేపీ వస్తుందని చెబుతున్న సర్వేలు, ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

మొత్తం 60 సీటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీపుల్స్‌ అనే సంస్థ బీజేపీ 25 నుంచి 29 స్థానాల వరకు గెలుచుకోనున్నట్లు తెలిపింది.

Manipur Assembly Elections Results 2022 (Photo Credits: LatestLY)

Imphal, March 10: ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మణిపూర్‌లో 60 స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 265 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మణిపూర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను బట్టి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి సీఎం బీరెన్‌సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు సర్వేల ఫలితాల్లో తేలింది.

కాగా మణిపూర్‌లో 60 సీట్లకు రెండు విడతల్లో ( ఫిబ్రవరి 28, మార్చి 5) పోలింగ్ నిర్వహించారు. మొత్తం 60 సీటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీపుల్స్‌ అనే సంస్థ బీజేపీ 25 నుంచి 29 స్థానాల వరకు గెలుచుకోనున్నట్లు తెలిపింది. కాంగ్రెస్‌ 17 నుంచి 21 సీట్లు వరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది. అదే విధంగా ఎన్‌పీపీ 7 నుంచి 11, ఎన్‌పీఎఫ్‌ 3 నుంచి 5, ఇతరులు 2 నుంచి అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందనున్నట్లు పీపుల్స్‌ పల్స్‌ పేర్కొంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ప్రారంభమైన కౌంటింగ్, 5 రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు మొదలైన ఓట్ల లెక్కింపు

బీజేపీ 33 శాతం.. కాంగ్రెస్‌ 29 శాతం వరకు ఓట్లు సాధించవచ్చిని వెల్లడించింది. తాజా ఫలితాలను బట్టి మణిపూర్‌ ముఖ్యమంత్రి రేసులో బీరెన్‌ సింగ్‌ ముందు వరుసలో ఉన్నారు. ఈ సారి కూడా ఆయనే సీఎం పీఠాన్ని అధిరోహించనున్నట్లు తెలుస్తోంది.