MCD Election Result 2022: 15 ఏళ్ల బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన సామాన్యుడు, ఎంసీడీ ఎన్నికల్లో 134 సీట్లతో ఆమ్ ఆద్మీ ఘనవిజయం, 104 స్థానాలతో సరిపెట్టుకున్న కమలనాథులు

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MCD) ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది 15 సంవత్సరాలుగా ఎంసీడీలో పాగా వేసిన కమలనాథులకు అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) షాక్‌ ఇచ్చాడు

AAP-workers-celebrate-at-the-party-headquarters-in-New-Delhi (Photo-ANI)

New Delhi, Dec 7: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ‘సామాన్యుడు’సత్తా చాటాడు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MCD) ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది 15 సంవత్సరాలుగా ఎంసీడీలో పాగా వేసిన కమలనాథులకు అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) షాక్‌ ఇచ్చాడు. ఆప్‌ 134 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 104 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్‌ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. మూడు చోట్ల ఇతరులు పాగా వేశారు.

ఈ విజయం కోసం నేను ఢిల్లీ ప్రజలను అభినందిస్తున్నాను, మార్పు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఢిల్లీ MCD ఎన్నికల్లో (MCD Election Result 2022) పార్టీ విజయం సాధించినందున ఢిల్లీ CM, AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నేను ఇప్పుడు ఢిల్లీ కోసం పని చేయడానికి BJP & కాంగ్రెస్ సహకారం కోరుకుంటున్నాను. నేను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఢిల్లీని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి ఆశీస్సులు కోరుతున్నాను. ఎంసీడీని అవినీతి రహితంగా తీర్చిదిద్దాలి. ఈరోజు ఢిల్లీ ప్రజలు యావత్ దేశానికి సందేశం ఇచ్చారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

అసలేమిటి ఈ మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు వివాదం, ఎందుకు అంతలా నిరసనలు వెలువెత్తుతున్నాయి, ఆందోళనల నేపథ్యంలో కర్నాటకకు బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ఢిల్లీ మహా నగర మేయర్‌ పీఠాన్ని ఈసారి మహిళకు కట్టబెట్టనున్నారు ఢిల్లీ సీఎం. మహిళను మేయర్‌ చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు. ఆప్‌ తరపున పలువురు మహిళలు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో మేయర్‌ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. ఎంసీడీ ఎన్నికల్లో విజయంతో ‘ఆమ్ ఆద్మీ’ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

ఈఎంఐలు కడుతున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్! మరోసారి వడ్డీరేట్లు పెంచుతూ ఆర్బీఐ ప్రకటన, వరుసగా మూడోసారి రెపోరేటును పెంచిన కేంద్రబ్యాంకు, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ తగ్గించేందుకు చర్యలంటూ ప్రకటన

తమపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రతికూల పార్టీని ఓడించడం ద్వారా ఢిల్లీ ప్రజలు నిజాయితీగా పనిచేసే అరవింద్‌ కేజ్రీవాల్‌ను గెలిపించారు. మాకు ఇది విజయం మాత్రమే కాదు, పెద్ద బాధ్యత’ని సిసోడియా ట్వీట్‌ చేశారు.

ఢిల్లీలో జ‌రిగిన మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ట్రాన్స్‌జెండ‌ర్ బాబీ కిన్నార్ గెలిచింది. ఎంసీడీ ఎన్నిక‌ల్లో ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కౌన్సిల‌ర్‌గా ఎన్నిక కావ‌డం ఇదే తొలిసారి. ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌పున సుల్తాన్‌పూర్ మ‌జ్రా వార్డు నుంచి బాబీ ఎన్నికైంది. బీజేపీకి చెందిన ఏక్తా జాత‌వ్‌పై ఆమె గెలుపొందారు.