Gujarat CM Vijay Rupani-CAA: ముస్లింలకు150 దేశాలు ఉన్నాయి, హిందువులకు ఇండియా ఒక్కటే ఉంది, పౌరసత్వ సవరణ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేసిన గుజరాత్ సీఎం, కాంగ్రెస్ పార్టీపై మండిపడిన విజయ్ రూపానీ

ముస్లింలు(Muslims) జీవించేందుకు ప్రపంచవ్యాప్తంగా 150 ఇస్లామిక్‌ దేశాలున్నాయని, హిందువులకు(Hindus) మాత్రం కేవలం భారతదేశంలోనే తలదాచుకోవాల్సిన పరిస్ధితి ఉందని గుజరాత్‌ సీఎం అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Muslims have 150 countries to go to, Hindus have only India: Gujarat CM Vijay Rupani doing (Photo-PTI)

December 25: Gandhi Nagar: దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు (Citizenship Amendment Act (CAA)మిన్నంటుతున్న నేపథ్యంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (Gujarat Chief Minister Vijay Rupani)కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు(Muslims) జీవించేందుకు ప్రపంచవ్యాప్తంగా 150 ఇస్లామిక్‌ దేశాలున్నాయని, హిందువులకు(Hindus) మాత్రం కేవలం భారతదేశంలోనే తలదాచుకోవాల్సిన పరిస్ధితి ఉందని గుజరాత్‌ సీఎం అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఆప్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల (Afghanistan, Pakistan and Bangladesh) నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పించే చట్టాన్ని కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకిస్తుందో దానికే తెలియడం లేదని దుయ్యబట్టారు.

సీఏఏతో భారతీయులకు ఎలాంటి నష్టం జరగదు: ప్రధాని

సబర్మతి ఆశ్రమం వద్ద పౌర చట్టానికి మద్దతుగా జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి గుజరాత్‌ సీఎం విజయ్ రూపానీ మాట్లాడారు. ఈ అంశంపై జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ల వైఖరులకు విరుద్ధంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా 'పౌరసత్వ' నిరసనలు, దేశ రాజధాని సహా చాలా చోట్ల 144 సెక్షన్ విధించిన అధికారులు

దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్‌లో 22 శాతంగా ఉన్న భారత జనాభా వారిపై దౌర్జన్యం, హింసాకాండ, లైంగిక దాడుల కారణంగా ప్రస్తుతం కేవలం మూడు శాతానికి పడిపోయిందని అన్నారు.

నా దిష్టి బొమ్మలు కాల్చండి..అంతేకాని ప్రజల ఆస్తులను ధ్వంసం చేయకండి

అందుకే అక్కడి హిందువులు భారత్‌కు తిరిగిరావాలని కోరుకుంటున్నారని, వారు మాతృదేశంలో గౌరవంగా జీవించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు.

రైల్వే స్టేషన్లకు నిప్పు, పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ బిల్లును నిరసిస్తూ మిన్నంటిన ఆందోళనలు, కఠిన చర్యలు తప్పవన్న మమతా బెనర్జీ

ముస్లింలు ప్రపంచంలో 150 దేశాల్లో ఎక్కడైనా తలదాచుకోవచ్చని హిందువులకు కేవలం భారత్‌ ఒక్కటే ఆశ్రయం ఇచ్చే దేశమని, హిందువులు ఇక్కడకు తిరిగి రావాలనుకుంటే సమస్య ఏమిటని ప్రశ్నించారు.