Rahul Gandhi: కార్యకర్తలకు, నేతలకు రాహుల్ గాంధీ షాక్, పార్టీ పగ్గాలు చేపట్టే ప్రసక్తే లేదంటున్నారంటూ వార్తలు, ఏప్రిల్‌లో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో కీలక ప్రకటన వెలువడే అవకాశం

బీజేపీ (BJP) దెబ్బకు రెండు సార్లు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీని నడిపించే వారే కరువయ్యారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తాడు అని భావిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకుల ఆశలపై రాహుల్ గాంధీ నీళ్లు చల్లారనే వార్తలు వస్తున్నాయి.

File image of Sonia Gandhi with son Rahul Gandhi | (Photo Credits: PTI)

New Delhi, Mar 04: దశాబ్దాల పాటు మకుటం లేని మహరాజుగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని (Congress Party) ఇప్పుడు నాయకత్వ లేమి వెంటాడుతోంది. బీజేపీ (BJP) దెబ్బకు రెండు సార్లు ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీని నడిపించే వారే కరువయ్యారు.

అత్యాచారాల రాజధానిగా భారత్ : రాహుల్ గాంధీ

పార్టీ పగ్గాలు చేపట్టి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని, కార్యకర్తల్లో, నేతల్లో భరోసాను నింపే నాయకుడు కనుచూపు మేరలో కనపడటం లేదు. పార్టీకి ఆశా కిరణంగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం ఓ సారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురాలేక పోయాడు. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు.

కాగా మళ్లీ 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తాడు అని భావిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకుల ఆశలపై రాహుల్ గాంధీ నీళ్లు చల్లారనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టే ప్రసక్తే లేదని,ఇందులో వేరే ప్రశ్నే లేదని స్వయంగా రాహుల్ గాంధీ తేల్చి చేప్పేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని రాహుల్ సన్నిహితులు ఓ ప్రముఖ మీడియాకు తెలిపినట్లుగా కథనం వచ్చింది.

'నిజమైన సమస్యలపై' ఫోకస్ చేయండి మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్

ఇటీవల జరిగిన హర్యాణా,జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చూపించడంలో ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు మంచి జోష్ మీద ఉన్నారు. అయితే జోష్ జాతీయ స్థాయిలో కానరావడం లేదు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి సృష్టంగా కన్పిస్తోంది. ఈ సమయంలో ప్రధాని మోడీ (PM Modi) లాంటి చరిష్మా ఉన్న లీడర్ ని ఢీ కొట్టే సత్తా కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు భావిస్తున్న తరుణంలో ఇలాంటి వార్తలు కార్యకర్తలను నిరాశలోకి తీసుకువెళుతున్నాయి.

బిజీగా ఉండే రాహుల్ గాంధీ బ్యాట్ పట్టాడు

2017లో తన తల్లి సోనియాగాంధీ (Sonia Gandhi) తప్పుకోవడంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఏప్రిల్ లో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయంపై రాహుల్ ప్రకటన చేయనున్నారని,తిరిగి అధ్యక్ష బాధ్యతలను రాహుల్ చేపట్టబోతున్నారంటూ ఇప్పటివరకు వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే.

చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు అస్సాంలో సాగవు

అయితే తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ప్రశక్తే ఉండబోదని రాహుల్ తేల్చిచెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలపడంతో కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు డీలా పడ్డారు. ప్రస్తుతం తాత్కాలిక కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా సోనియాగాంధీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ముదిరిన హోమో సెక్సువల్ రాజకీయం

మరోవైపు మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బీజేపీ భయం పట్టుకుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తోందని,కొంతమందిని ఢిల్లీకి దగ్గర్లోని గురుగ్రామ్ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి పరిమితం చేశారని కమల్ నాథ్ సర్కార్ ఆరోపిస్తోంది. ఇటువంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif