Guwahati, December 28: అస్సాంలో బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిప్పులు (Rahul Gandhi Attacks BJP) చెరిగారు. దేశ విభజనే ప్రధాన ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ గౌహతిలో జరిగిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ...బీజేపీ (BJP)ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందన్నారు. ఆందోళనకారుల్ని కాల్చి చంపుతున్నారని రాహుల్ (Rajul Gandhi) ప్రశ్నించారు. ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదని మండి పడ్డారు.
యువత, ప్రజల సమస్యలు పట్టని మోడీ మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని మరోసారి విభజించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శనివారం అస్సాంలో (Assam) పర్యటించిన రాహుల్ (Congress leader Rahul Gandhi )అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గతంలో ప్రపంచ దేశాల్లో భారత్‌కు మంచి గుర్తింపు ఉండేదని.. నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను మోడీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. నిరుద్యోగంతో యువత అల్లాడుతున్నారని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు.
Here's ANI tweet
#WATCH Rahul Gandhi in Guwahati: Hum BJP aur RSS ko Assam ki history, bhasha ,sanskriti par akraman nahi karne denge. Assam ko Nagpur nahi chalayega, Assam ko RSS ke chaddi wale nahi chalayenge. Assam ko Assam ki janta chalayegi. pic.twitter.com/hzg4qaPRPv
— ANI (@ANI) December 28, 2019
పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని లీడ్ చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక కొంతమంది వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని బీజేపీ పార్టీని విమర్శించారు.
Here's Rahul Gandhi Speech
Rahul Gandhi in Guwahati: Wherever the BJP goes, it spreads hate. In Assam, youth is protesting, in other states protests happening as well. Why do you have to shoot and kill them? BJP doesn't want to listen to voice of people pic.twitter.com/Xr2f4zV9tM
— ANI (@ANI) December 28, 2019
ఈశాన్య ప్రాంతమైన అస్సాంపై ఆర్‌ఎస్‌ఎస్ పెత్తనం కొనసాగించాలని ప్రత్నిస్తోందని, నాగపూర్ పాలన ఇక్కడ సాగదని (Assam Won't Be Run By Nagpur)రాహుల్ హెచ్చరించారు. అస్సాంను అస్సామీలే పాలిస్తారని రాహుల్ తెలిపారు. ఈశాన్య ప్రజల నాడిని బీజేపీ అర్థం చేసుకోలేదన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న చెడ్డీగ్యాంగ్ ఆగడాలు (chaddi wale nahi chalayenge)ఇక్కడి ప్రజలు తిప్పికొడతారని రాహుల్ పేర్కొన్నారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాహుల్ ఈ సందర్భంగా పరామర్శించనున్నారని అసోం కాంగ్రెస్ ఇంచార్జ్ తెలిపారు.