Mumbai, January 3: దేశంలోకి మునుపెన్నడూ లేని విధంగా స్వలింగ సంపర్క రాజకీయాలు చేరాయి. కాంగ్రెస్, ఆరెస్సెస్ మధ్య హోమో సెక్సువల్ రాజకీయాలు (homosexual relationship Politics) ముదిరి పాకానికి వచ్చాయి. కాంగ్రెస్ పార్టవ్.. గాడ్సే (Nathuram Godse),సావర్కర్ ( Vinayak Damodar Savarkar)స్వలింగ సంపర్కులు అంటూ తీవ్రమైన పదాలను వాడిన నేపథ్యంలో అంతే ధీటుగా విశ్వహిందూ పరిషత్) (Akhil Bhartiya Hindu Mahasabha తిప్పి కొట్టింది. వారు కాదు రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడు ('Rahul Gandhi Is Homosexual') అంటూ కౌంటర్ విసిరింది.
Here's the ANI tweet:
Akhil Bhartiya Hindu Mahasabha President Swami Chakrapani on statement in Congress Seva Dal booklet 'Godse&Savarkar had physical relations':These are ridiculous allegations against former Mahasabha President Savarkar ji.Similarly we have also heard that Rahul Gandhi is homosexual pic.twitter.com/vDSx0ctzvt
— ANI (@ANI) January 3, 2020
హౌ బ్రేవ్ ఈజ్ వీర్ సావర్కర్ ((Veer Savarkar, How Brave?) "('వీర సావర్కర్ కిత్నే వీర్)అనే పేరుతో (Veer Savarkar Kitne Veer?) ప్రచురించిన సేవాదళ్ బుక్‌లెట్‌లో(All India Congress Seva Dal) కాంగ్రెస్ పార్టీ గాడ్సే, సావర్కర్ స్వలింగ సంపర్కులు అంటూ భోపాల్ వేదికగా ప్రకటించింది. భోపాల్‌లో జరుగుతున్న పది రోజుల శిక్షణా శిబిరంలో ఈ బుక్‌లెట్‌ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. లారీ కొల్లిన్స్, డొమినిక్ లపైరే రాసిన 'ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్' పుస్తకంలోని 423వ పేజీని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
దీనిపై అఖిల భారతీయ హిందూ మహాసభ తీవ్ర స్థాయిలో మండి పడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడు అంటూ అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామీ చక్రపాణి (Swami Chakrapani)ఆరోపించారు. రాహుల్ గాంధీ కూడా హోమోసెక్సువల్ అని విన్నానని స్వామీజీ ధీటైన కౌంటర్ విసిరారు.
ఈ బుక్ లెట్ ను వెంటనే నిషేధించాలని వినాయక్ దామోదర్ సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ (Ranjit Savarkar) మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. 'సావర్కర్ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందనీ..అనుచిత ఆరోపణలు చేస్తూ..కాంగ్రెస్ దేశంలో అరాచకవాదాన్నివ్యాప్తి చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సేవాదళ్‌పై ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 120, 500, 503, 504, 505, 506 కింద కేసులు నమోదు చేసి..ఆ బుక్‌లెట్ ప్రభుత్వం నిషేధించాలని రంజిత్ సావర్కర్ డిమాండ్ చేశారు.