Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, ఆలయాలకు విధిస్తున్న పన్నులపై నిలదీత, భాషాసంస్కృతులపై వరుస ట్వీట్లు

పవన్ తన ట్వీట్లలో, ప్రసంగాల్లో ఎక్కువగా భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలు, ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు....

File images of Pawan Kalyan - YS Jagan - KCR | Photo: IANS

Amaravathi, November 25: జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలుగు భాష, భారతీయ సంస్కృతి- సంప్రదాయాలపై తన వాణిని పెంచారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అనేక అంశాలపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్,  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)ని లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

సీఎం జగన్ ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని  (English Medium) ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయంపై పవన్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 'మన నుడి- మన నది' పేరుతో భారతీయతను నొక్కి చెప్తున్నారు. తెలుగుకు మూలం దేవ భాష అయిన సంస్కృత భాష అని చెప్తూ, భారతీయ భాషల గొప్పదనాన్ని తెలిపే వేదపురణాలకు సంబంధించిన వీడియోలను, సూక్తులను ఉదహరిస్తున్నారు. జార్జ్ రెడ్డి ఐడియాలజీ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఇద్దరిదీ ఒకటే, మరి లాజిక్ ఎక్కడా?

అయితే, పవన్ తన ట్వీట్లలో, ప్రసంగాల్లో ఎక్కువగా భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలు, ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వ్యాఖ్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పవన్ ఆలోచనను పట్టి చూస్తే ఖచ్చితంగా అది కేంద్రం ప్రభుత్వంలో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలనే ఒక తపన, ప్రయత్నమైతే కనిపిస్తున్నది.

 

Pawan Kalyan Tweet 1:

 

ఆంధ్రప్రదేశ్‌లో దుష్టరాజకీయాలు జరుగుతున్నాయని చెపుతూ అకస్మాత్తుగా ఇటీవల దిల్లీ వెళ్లిన జనసేనాని, ఆ తర్వాత తన పర్యటనకు సంబంధించిన వివరాలేమి వెల్లడించలేదు.

పవన్ కళ్యాణ్ ఏదో చేస్తా, సీఎం జగన్ పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని బయలుదేరినా, ప్రధాని మోదీ గానీ, హోంమంత్రి అమిత్ షా గానీ కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆ తర్వాత వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేశారు. అయితే పవన్ మాత్రం వారి వ్యాఖ్యల పట్ల ఏమాత్రం స్పందించకుండా వైసీపీ ప్రభుత్వంపై ఎప్పట్లాగే తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.  (గెలుపు కోసం, వ్యక్తిగత లబ్ది కోసం పాకులాడే వ్యక్తిని కాదు)

రాయలసీమ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎక్కువగా మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా జరుగుతుందని రాయలసీమ ప్రాంతంలోనేనని పవన్ అన్నారు. రాయలసీమలో ముఠా కక్షలు, పాలెగాళ్ల సంస్కృతి ఇప్పటికీ ఉందని దుయ్యబట్టారు.

Pawan Kalyan Tweet 2:

ఇక్కడ ముఠాలదే రాజ్యం దళిత కులాల మీద దాడులు జరిగినా, వారు బయటకి వచ్చి చెప్పటానికి భయపడుతున్నారు. తన పోరాట యాత్రలో భాగంగా యువత తనను కలిసి వారి బాధలు వెళ్లపోసుకుంటుంటే గుండె కలిచి వేసిందని పవన్ పేర్కొన్నారు.

దేవాలయాలపై పన్ను ఎందుకని సెక్యులర్ ప్రభుత్వాలను నిలదీత

 

ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర సెక్యులర్ ప్రభుత్వాలు దేవాలయాలకు విధిస్తున్న పన్నులపై పవన్ నిలదీశారు. ఒక్క చర్చిగానీ, ఒక్క మసీదు గానీ ఒక్కరూపాయి కూడా చెల్లించడం లేదు మరి తాము సెక్యులర్ గా చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాల నుంచే 23.5 ఎందుకు వసూలు చేస్తున్నారు అని ప్రశ్నిస్తూ, చిలుకూరు బాలాజీ అర్చకుడి సందేశాన్ని ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

అయితే పవన్ కళ్యాణ్ ఒకవైపు కుల, మత, వర్గ, లింగ విబేధం లేని సమాజం ఉండాలి అంటూ రాజ్యాంగంలోని హక్కులను ఎత్తిచూపుతూనే మరోవైపు ఎక్కువగా ఒక మతానికే సంబంధించిన సూక్తులు, ప్రవచనాలు ఉదాహరణలుగా చెప్పడం, అలా ఒకదానితో ఒకటి విరుద్ధమైన సిద్ధాంతాలు గల అంశాలను ప్రస్తావించడం కొన్ని వర్గాల వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.