Pawan Kalyan: మీ వల్లే నేను ఓడిపోయాను, మీరు సరిగా ఉంటే నాకు ఇలా జరిగేది కాదు, కార్యకర్తలపై మండిపడిన పవన్ కళ్యాణ్, కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని హితవు, రైతు సమస్యలపై ఒక రోజు నిరాహార దీక్ష

మీరు క్రమశిక్షణగా ఉండి ఉంటే నేను గెలిచేవాడినని, మీరు క్రమశిక్షణ తప్పడం వల్లే నేను ఓడిపోయానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతు సదస్సు(Farmers Meet)లో రైతుల సమస్యలు వింటున్న సమయంలో కార్యకర్తలు ఒక్కసారిగా పవన్ సీఎం అంటూ నినాదాలు చేశారు.

Pawan Kalyan Serious on Janasena Activists in Farmers Meet File image of Pawan Kalyan | File Photo

Amaravathi,December 9: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యకర్తలపై మండిపడ్డారు. మీరు క్రమశిక్షణగా ఉండి ఉంటే నేను గెలిచేవాడినని, మీరు క్రమశిక్షణ తప్పడం వల్లే నేను ఓడిపోయానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతు సదస్సు(Farmers Meet)లో రైతుల సమస్యలు వింటున్న సమయంలో కార్యకర్తలు ఒక్కసారిగా పవన్ సీఎం అంటూ నినాదాలు చేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన జనసేనాని కార్యకర్తల తీరు(Janasena Activists)పై మండిపడ్డారు. జనసైనికులు సరిగా లేకపోవడంతోనే ఎన్నికల్లో ఓడియపోయానని అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు క్రమశిక్షణ ఉంటే జనసేన(Janasena) గెలిచి ఉండేదన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతు.. తన కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు.. మీరు అరవడం సరికాదని జనసైనికులకు పవన్ హితబోధ చేశారు. మీ తీరు ఇబ్బందికరంగా ఉందన్న పవన్ క్రమశిక్షణ లేకపోతే ఎవరైనా ఏం చేయలేరన్నారు. ‘మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోవాల్సి వచ్చింది. అది మర్చిపోకండి. క్రమశిక్షణ ఉండుంటే.. జనసేన గెలిచి ఉండేది’ అని జనసైనికుల పట్ల పవన్ కళ్యాణ్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు

ఈ సంధర్భంగా సీఎం జగన్( ap cm ys jagan) ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా సరే రైతు కడుపు కొడితే కాలిపోవాల్సిందేనని హెచ్చరించారు. రైతులకు అండగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో రైతు సమస్యలపై పవన్ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈనెల 12న కాకినాడలో నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. కుల మతాలకు అతీతంగా రైతులకు ఏదో ఒకటి చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనవరిలోగా రైతు సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.