BJP Foundation Day: ప్రధాని మోదీ పంచ సూత్రాలు, వ్యవస్థాపక దినోత్సవం సంధర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు, పీఎం కేర్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని పిలుపు
వీడియో సందేశం ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన పార్టీకన్నా దేశమే ముఖ్యమని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సేవా కార్యక్రమలలో పాల్గొనే వారు తప్పక మాస్కులు ధరించాలని సూచించారు.
New Delhi, April 6: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) (Bharatiya Janata Party (BJP) 40వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని సోమవారం(06 ఏప్రిల్ 2020) నాయకులకు, కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోడీ ( PM Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నిర్మాణంలో, అభివృద్దిలో విశేష కృషి చేసినవారిని గుర్తు చేసుకున్న మోదీ (Modi) .. బీజేపీ (BJP) అధికారంలోకి రాగానే సుపరిపాలన, పేదల సంక్షేమం పైనే ప్రధానంగా దృష్టి పెట్టిందని వెల్లడించారు.
కార్యకర్తలకు, నాయకులకు, వ్యవస్థాపక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ
పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా బీజేపీ కార్యకర్తలు చాలా కృషి చేసి అనేకమంది జీవితాల్లో వెలుగులు నింపారని, సమాజ సేవ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. పార్టీని బలోపేతం చేయడం కోసం దశాబ్ధాలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. వారి కృషి కారణంగానే దేశవ్యాప్తంగా బీజేపీ జెండా ఎగురుతుందని అన్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలకు మోదీ పంచ సూత్రాలు చెప్పారు. వీడియో సందేశం ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన పార్టీకన్నా దేశమే ముఖ్యమని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సేవా కార్యక్రమలలో పాల్గొనే వారు తప్పక మాస్కులు ధరించాలని సూచించారు.
దియా జలావొ గ్రాండ్ సక్సెస్, కరోనాను తరిమికొట్టడానికి ఏకమైన దేశ ప్రజలు
1. ప్రతి కార్యకర్తా పేదలకు రేషన్ అందేలా చూడాలి.
2. కనీసం ఐదుగురికి మాస్క్‌లు(సాధారణ బట్టలతో తయారు చేసినవైనా) అందేలా చూడాలి.
3. కరోనాపై పోరాడుతున్న యోధులకు ధన్యవాదాలు తెలియజేయాలి.
4. కేంద్రం విడుదల చేసిన ఆరోగ్య సేతు యాప్‌ను కనీసం 40 మంది డౌన్‌లౌడ్ చేసుకునేలా చూడాలి.
5. పీఎం కేర్ ఫండ్‌కు విరాళాలిచ్చేలా కనీసం 40 మందిని ప్రోత్సహించాలి.
ఘోరమైన కరోనావైరస్ పై పోరాడటానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన ప్రధాని, కరోనావైరస్ మహమ్మారి యొక్క తీవ్రతను అర్థం చేసుకున్న మరియు దానిపై పోరాటం ప్రారంభించిన దేశాలలో భారతదేశం ఉందని అన్నారు. భారతదేశం సమగ్ర విధానంతో పనిచేసిందని, భారతదేశం చేసిన ప్రయత్నాలను WHO కూడా ప్రశంసించిందని ప్రధాని అన్నారు. "ఇది సార్క్ సమావేశం అయినా, జి 20 సమ్మిట్ అయినా, ప్రపంచం ఈ మహమ్మారితో కలిసి పోరాడుతుందని భరోసా ఇవ్వడంలో భారత్ గొప్ప పాత్ర పోషించింది" అని ఆయన అన్నారు.
రథయాత్రతో బీజేపీని పరుగులు పెట్టించిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
జనతా కర్ఫ్యూ అయినా, లేదా ఎక్కువసేపు లాక్డౌన్ అయినా భారతీయులు అందరూ కలిసి ఇవన్నీ చేశారని ప్రధాని తెలిపారు. ఈ పరిస్థితిలో భారత ప్రజలు పరిపక్వత చూపించారని ఆయన అన్నారు. "ఇంత పెద్ద దేశంలో ప్రజలు కలిసి పోరాడుతారని ఎవ్వరూ అనుకోలేదు. గత రాత్రి 9 గంటలకు, ప్రతి వ్యక్తి, ధనికులు, పేదలు, యువకులు, ముసలివారు, ప్రతి ఒక్కరూ ఒక దియా లేదా కొవ్వొత్తి వెలిగించడం చూశాము. ఈ పోరాటంలో తాము కలిసి ఉన్నామని ప్రజలు మరోసారి చూపించారు "అని ఆయన అన్నారు.
అంతకుముందు రోజు, ప్రత్యేక రోజున పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకు పిఎం మోడీ కృతజ్ఞతలు తెలిపారు మరియు సామాజిక దూరం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాలని, లాక్డౌన్ మధ్య అవసరమైన వారికి సహాయం చేయాలని మరియు కోవిడ్ -19 ను అధిగమించడానికి భారతదేశాన్నిరెడీ చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు.