Pro-Tem Speaker For 'MAHA' Floor Test: ప్రొటెం స్పీకర్ చేతిలో మహారాష్ట్ర పొలిటికల్ బంతి, రేపటి బల పరీక్షతో తేలనున్న సీఎం భవితవ్యం, ప్రొటెం స్పీకర్ రేసు లిస్టులో ఉన్నది వీరే..
రేపు జరగబోయే బల పరీక్షతో మహారాష్ట్ర రాజకీయాలకు శుభం కార్డు పడనుంది. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీని బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో(Supreme Court ordering a floor test in Maharashtra) ఇప్పుడు సర్వత్రా ఉత్కఠం మొదలైంది.
Mumbai, November 26: మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. రేపు జరగబోయే బల పరీక్షతో మహారాష్ట్ర రాజకీయాలకు శుభం కార్డు పడనుంది. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీని బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో(Supreme Court ordering a floor test in Maharashtra) ఇప్పుడు సర్వత్రా ఉత్కఠం మొదలైంది. మెజార్టీకి బీజేపీకి 40మంది ఎమ్మేల్యేల సపోర్టు అవసరం కానుండటంతో అజిత్ పవార్ వర్గం ఎంతమంది ఉన్నారనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగదా పూర్తి స్థాయి స్పీకర్ అవసరం లేదని... ప్రొటెం స్పీకర్(pro-tem speaker) ఆధ్వర్యంలోనే బలపరీక్షను నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఇప్పుడు అక్కడ ప్రొటెం స్పీకర్ నియామకంపై తర్జనభర్జన కొనసాగుతోంది. ఈ పదవి కోసం ఆరుగురి పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ భగత్ సింగ్ (Maharashtra Governor Bhagat Singh Koshyari) ప్రస్తుత ప్రభుత్వం ఓ జాబితాను పంపించింది.
ఈ జాబితాలో రాధాకృష్ణ పాటిల్(Radhakrishna Vikhe-Patil) (బీజేపీ), బాబన్ రావు భికాజీ (Babanrao Pachpute)(బీజేపీ), కాళిదాస్ కోలంబ్కర్(Kalidas Kolambkar) (బీజేపీ), కేసీ పద్వి (KC Padvi) (కాంగ్రెస్), బాలాసాహెబ్ థోరత్ (కాంగ్రెస్)(Balasaheb Thorat), దిలీప్ వాల్సే పాటిల్ (Dilip Walse-Patil ) (ఎన్సీపీ) పేర్లు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేలలో వీరే అత్యంత సీనియర్లు. సీనియారిటీ ఎక్కువ ఉన్న వారికి ప్రొటెం స్పీకర్ బాధ్యతలను కట్టబెట్టడం ఆనవాయతీ. వీరిలో ఒకరిని ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ఎంపిక చేయనున్నారు. మరోవైపు, బలపరీక్ష రేపే కావడంతో... తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో అన్ని పార్టీలు తలమునకలయ్యాయి.