Mumbai, November 26: అసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి థ్రిల్లర్ మూవీని తలపిస్తున్న మహా రాజకీయాలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పును వెలువరించింది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి(BJP leader Devendra Fadnavis ) రేపు బలపరీక్ష నిర్వహించాలని(floor test in Maharashtra assembly tomorrow) సుప్రీం బెంచ్ ఆదేశించింది. ఓపెన్ బ్యాలెట్ (Open Ballet) రూపంలో విశ్వాస పరీక్ష చేపట్టాలని సూచించింది.
ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదని కోర్టు తెలిపింది. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం (Live Telecast Of Maharashtra Floor Test)కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో మహా కేసులో సుప్రీం కోర్టు ఉత్తరాఖండ్, బీహార్ జగదంబికా పాల్ కేసులను ప్రస్తావించింది. ప్రోటెమ్ స్పీకర్ ద్వారా బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది.
ANI Tweet
Floor test in Maharashtra Assembly on Nov 27 before 5 pm, orders Supreme Court
Read @ANI Story | https://t.co/tqDycKMScK pic.twitter.com/gNInjdjMfk
— ANI Digital (@ani_digital) November 26, 2019
రహస్య ఓటింగ్ లేదని, రేపే బలపరీక్ష ఎదుర్కోవాలని ఫడ్నవీస్‌కు స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ తీర్పును చదివి వినిపించారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన సుప్రీం బెంచ్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
మరోవైపు సుప్రీం నిర్ణయంతో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ శిబిరంలో ఉత్తేజం నెలకొంది. బలపరీక్ష జరిగే వరకూ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా మూడు పార్టీలు చర్యలు చేపట్టగా, ఎన్సీపీ చీలిక వర్గ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో బలపరీక్షలో బయటపడాలని బీజేపీ యోచిస్తోంది.