Puducherry Floor Test: పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం, బల పరీక్షను నిరూపించుకోవడంలో విఫలమైన నారాయణస్వామి సర్కార్, సీఎం రాజీనామా, తదుపరి ముఖ్యమంత్రిపై పెరుగుతున్న ఉత్కంఠ
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఇన్‌చార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలతో బలనిరూపణలో (Puducherry Assembly Floor Test) నారాయణస్వామి ప్రభుత్వం విఫలం అయ్యింది. దీంతో సీఎం పదవికి రాజీనామా ( Puducherry CM Resignation) చేశారు.
Puducherry, Feb 22: పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఇన్‌చార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలతో బలనిరూపణలో (Puducherry Assembly Floor Test) నారాయణస్వామి ప్రభుత్వం విఫలం అయ్యింది. దీంతో సీఎం పదవికి రాజీనామా ( Puducherry CM Resignation) చేశారు. రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు సీఎం నారాయణస్వామి బయల్దేరారు. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, మరో ఎమ్మెల్యే ఉద్వాసనకు గురవడంతో ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం బలాన్ని నిరూపించుకోవాలసి వచ్చింది.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్-డీఎంకే ప్రభుత్వానికి ఆదివారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 33 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వ బలం 11కు పడిపోయింది. తాజాగా రాజీనామా చేసిన వారిలో ఒకరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాగా, మరొకరు భాగస్వామ్య పార్టీ డీఎంకే ఎమ్మెల్యేగా ఉన్నారు.
ప్రతిపక్షాలకు 14 మంది ఎమ్మెల్యేలు…. అధికార కూటమికి 12 మంది ఎమ్మెల్యేలే ఉండటంతో నారాయణ స్వామి (Puducherry CM Narayanasamy) బల నిరూపణలో విఫలమయ్యారు. మొత్తంగా ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్-DMK కూటమి ప్రభుత్వం మైనారిటీలో పడింది. పుదుచ్చేరీ అసెంబ్లీలో 30 సీట్లు ఉండగా, 3 నామినేటెడ్ సీట్లు ఉన్నాయి. ఆ ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు బీజేపీ వారే. ప్రస్తుతం అధికార కూటమికి 12 మంది, ప్రతిపక్షాలకు 14మంది ఎమ్మెల్యేల బలముంది.
కాంగ్రెస్, DMK రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో 7 స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 26కు తగ్గింది. కాంగ్రెస్, డీఎంకే కూటమి బలం 12కు తగ్గింది. ఇందులో కాంగ్రెస్ కు 9, DMK 2, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. ప్రతిపక్షాలకు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మాజీ సీఎం రంగస్వామి నేతృత్వంలోని ఆల్ ఇండియా N.R.కాంగ్రెస్ కు ఏడుగురు, AIADMKకు నలుగురు ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలున్నారు.
2016 ఎన్నికల్లో కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. నాలుగున్నరేళ్లు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడితో అధికార వార్‌కే అధిక సమయం కేటాయించిన సీఎం నారాయణస్వామి, తాజాగా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోకతప్పలేదు. గత ఏడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్ తిరుగుబావుటా ఎగురవేసిన నాటి నుంచి దినదిన గండం అన్నట్టుగా ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి నారాయణస్వామికి తప్పలేదు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)