Rahul Slams Modi Govt: కేంద్రం నా హెచ్చరికలను పట్టించుకోవడం లేదు, దేశంలో కరోనా కల్లోలానికి, చైనా వివాదానికి కేంద్రం నిర్లక్ష్యమే కారణం, ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన రాహుల్ గాంధీ

దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ( economic slowdown), చైనాతో సరిహద్దు వివాదం సహా పలు కీలకాంశాలపై రాహుల్‌ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కోవిడ్‌-19 (COVID 19), ఆర్థిక వ్యవస్థ దీనస్థితిపై తాను హెచ్చరిస్తునే ఉన్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని..ఆపై ఎలాంటి పరిస్థితి ఎదురైందో చూశామన్నారు. చైనా విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా..వారు వినిపించుకోవడం లేదని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

Rahul Gandhi | File Image | (Photo Credits: PTI)

New Delhi, July 24: కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Slams Modi Govt) మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ( economic slowdown), చైనాతో సరిహద్దు వివాదం సహా పలు కీలకాంశాలపై రాహుల్‌ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కోవిడ్‌-19 (COVID 19), ఆర్థిక వ్యవస్థ దీనస్థితిపై తాను హెచ్చరిస్తునే ఉన్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని..ఆపై ఎలాంటి పరిస్థితి ఎదురైందో చూశామన్నారు. చైనా విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా..వారు వినిపించుకోవడం లేదని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ కేంద్రం ఒత్తిడికి లొంగిపోయాడు, తాడో పేడో తేల్చుకుంటామని తెలిపిన ఆశోక్ గెహ్లాట్, సుప్రీంకోర్టులో పైలెట్ వర్గానికి ఊరట, కేంద్రంపై విరుచుకుపడిన రాజస్థాన్ సీఎం

చైనాతో వివాదంపై (India-China Border) ప్రభుత్వ తీరును తప్పుపడుతూ రాహుల్‌ (Rahul Gandhi) గత కొద్దిరోజులుగా ట్విటర్‌లో పలు వీడియోను షేర్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తన సొంత ప్రతిష్టను పెంచుకోవడంపై నూరు శాతం దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దేశంలో వ్యవస్ధలు సైతం ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. జాతీయ విజన్‌కు ఒక వ్యక్తి ఇమేజ్‌ ప్రత్యామ్నాయం కాబోదని రాహుల్‌ గురువారం వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్‌ విక్రమ్‌ జోషి హత్యపైనా యూపీ సర్కార్‌ తీరును ఇటీవల ఆయన ఎండగట్టారు.

Here's what Rahul Gandhi said: 

తాజాగా ల‌డ‌ఖ్‌లో చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న అంశాన్ని కూడా కేంద్రం విస్మ‌రిస్తోంద‌ని కాంగ్రెస్ నేత ఆరోపించారు. కోవిడ్‌19పై వార్నింగ్ ఇస్తున్నా.. ప్ర‌భుత్వం నిర్లిప్తంగా ఉంద‌ని, అందుకే వైర‌స్ కేసులు అధిక‌మైన‌ట్లు ఆయన తెలిపారు. కోవిడ్‌19తో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప‌డే ప్ర‌భావం గురించి వార్నింగ్ ఇచ్చాన‌ని, కానీ ప్ర‌భుత్వం వాటిని కొట్టిపారేసింద‌ని, ఆ త‌ర్వాత విధ్వంసం మొద‌లైంద‌న్నారు. చైనా అంశంలోనూ వార్నింగ్ ఇచ్చాన‌ని, ఆ అంశాన్ని కూడా కేంద్రం కొట్టిపారేస్తున్న‌ద‌ని రాహుల్ ట్వీట్ చేశారు.