Rajasthan Political Drama: స‌చిన్ పైల‌ట్‌ను 24 వరకూ టచ్ చేయవద్దు, రాజస్తాన్‌ స్పీకర్‌‌కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, పిటిషన్‌పై జూలై 24న తీర్పు ఇవ్వనున్న రాజస్థాన్ హైకోర్టు

ఈ పిటిష‌న్‌పై హైకోర్టు నేడు విచార‌ణ చేప‌ట్టింది. నేటి విచార‌ణ సంద‌ర్భంగా అసమ్మతి నేత సచిన్ పైలట్ ( Sachin Pilot), అతని గ్రూప్ ఎమ్మెల్యేలకు హైకోర్టు పెద్ద‌ ఉపశమనం కలిగించింది. ఈ నెల 24 వరకు రెబల్‌ ఎమ్మెల్యేల ( Rebel Congress MLAs) అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్‌ స్పీకర్‌ను ఆదేశించింది.

File image of sacked Rajasthan deputy CM Sachin Pilot | (Photo Credits: ANI)

Jaipur, July 21: రాజ‌స్థాన్ అసెంబ్లీ స్పీక‌ర్ ఇచ్చిన నోటీసుల‌ను స‌వాలు చేస్తూ స‌చిన్ పైల‌ట్ తోపాటు మ‌రో 18 మంది రెబ‌ల్‌ ఎమ్మెల్యేలు హైకోర్టులో (Rajasthan High Court) పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై హైకోర్టు నేడు విచార‌ణ చేప‌ట్టింది. నేటి విచార‌ణ సంద‌ర్భంగా అసమ్మతి నేత సచిన్ పైలట్ ( Sachin Pilot), అతని గ్రూప్ ఎమ్మెల్యేలకు హైకోర్టు పెద్ద‌ ఉపశమనం కలిగించింది. ఈ నెల 24 వరకు రెబల్‌ ఎమ్మెల్యేల ( Rebel Congress MLAs) అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాజస్తాన్‌ స్పీకర్‌ను ఆదేశించింది. సచిన్ పైలట్‌పై విరుచుకుపడిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, హైకోర్టులో కొనసాగుతున్న విచారణ, పైలట్ అనర్హతపై కోర్టు జోక్యం చేసుకోలేదని తెలిపిన న్యాయ‌వాది అభిషేక్ మ‌నూ సంఘ్వి

అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిసిన అనంతరం ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే శుక్రవారం (జులై 24) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇక రాజస్తాన్‌ మంత్రివర్గం కాసేపట్లో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై (Ashok Gehlot) తిరుగుబాటు చేయడంతో పైలట్‌ను రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన సంగ‌తి తెలిసిందే. సచిన్‌ సహా 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హతన వేటు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం‌ నిర్ణయం తీసుకుంది. విప్‌ ధిక్కరణపై స్పీకర్‌ సీపీ జోషి వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే, నిబంధనలు అనుసరించకుండా తమకు నోటీసులు ఇచ్చారని పేర్కొంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు కోర్టు మెట్లెక్కారు.