Rajasthan Political Crisis: రాజస్థాన్ రాజకీయాల్లో కీలక మలుపు, సొంత గూటికి తిరిగిరానున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు
సీఎం అశోక్ గెహ్లాట్ మీద తిరుగుబావుటా ఎగరవేసిన సచిన్ పైలట్ (Sachin Pilot) ఎట్టకేలకు మళ్లీ సొంత గూటికి చేరే అవకాశం ఉన్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ నాయకులకు చిక్కకుండా ఉన్న సచిన్ పైలట్.. సోమవారం రాహుల్, ప్రియాంక వాద్రలతో గంటన్నర పాటు సమావేశమైనట్లు అక్కడి రాజకీయవర్గాలు చెప్తున్నాయి. పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు.
Jaipur, August 10: ఆగస్టు 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు (Rajasthan Political Crisis) కీలక మలుపులు తిరుగతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ మీద తిరుగుబావుటా ఎగరవేసిన సచిన్ పైలట్ (Sachin Pilot) ఎట్టకేలకు మళ్లీ సొంత గూటికి చేరే అవకాశం ఉన్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ నాయకులకు చిక్కకుండా ఉన్న సచిన్ పైలట్.. సోమవారం రాహుల్, ప్రియాంక వాద్రలతో గంటన్నర పాటు సమావేశమైనట్లు అక్కడి రాజకీయవర్గాలు చెప్తున్నాయి. పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు.
అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని (Ashok Gehlot Govt) కూలదోసేందుకు ప్రయత్నించి విఫలమైన సచిన్ పైలట్ వర్గం ఎట్టకేలకు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. పైలట్ వర్గంతో కాంగ్రెస్ అధిష్టానం జరుపుతున్న చర్చలు సానూకూలంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో ప్రభుత్వ సంక్షోభం పరిష్కరమవుతుందని పార్టీ హామీ ఇచ్చిందని బాహాటంగా అంటున్నారు. అయితే ఈ వార్తలను పైలట్ వర్గం ఖండించింది. అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తేనే మద్దతుగా నిలుస్తామని ఆయన వర్గం పేర్కొంది. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి, రాజ్‌భవన్‌ని ముట్టడించిన రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
మరో వైపు తిరుబాటు చేసిన19 మంది ఎమ్మెల్యేల (Rebel Congress MLAs) మద్దతు లేకుండానే విశ్వాస పరీక్షలో నెగ్గాలని అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) భావిస్తున్నారు. ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు. విశ్వాస పరీక్షలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు ఆదివారం లేఖలు రాశారు.‘సత్యం పక్షాన నిలవండి–ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేయడానికి, ఓటర్ల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి’అని లేఖలో వ్యాఖ్యానించారు. గవర్నర్ కేంద్రం ఒత్తిడికి లొంగిపోయాడు, తాడో పేడో తేల్చుకుంటామని తెలిపిన ఆశోక్ గెహ్లాట్, సుప్రీంకోర్టులో పైలెట్ వర్గానికి ఊరట, కేంద్రంపై విరుచుకుపడిన రాజస్థాన్ సీఎం
ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలను గుజరాత్‌కి తరలించింది. శనివారం ఆరుగురు శాసనసభ్యులు పోరుబందర్‌కి, మరో 12 మంది ఎమ్మెల్యేలు అహ్మదాబాద్‌కు తరలించింది. ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. సచిన్ పైలట్ వర్గం హరియాణాలో ఆశ్రయం పొందుతుండగా సీఎం గెహ్లాట్ వర్గం జైసెల్మేర్ రిసార్టుల్లో గడుపుతున్నారు.