Rajinikanth-CAA Row: సీఏఏకు మద్ధతు తెలిపిన రజినీకాంత్, ఈ చట్టంతో ముస్లింలకు ఎలాంటి ముప్పు ఉండదు, వారికి ఇబ్బందులు వస్తే ముందుగా నేనే వారికి అండగా నిలబతానన్న సూపర్ స్టార్
తమిళ సూపర్‌స్టార్ రజనీ కాంత్ పౌరసత్వ సవరణ చట్టానికి (CAA)మద్ధతు తెలిపారు. సీఏఏకి వ్యతిరేక ఆందోళనలు, అనుకూల గొంతులు ముమ్మరంగా వినిపిస్తున్న సమయంలో ఈ చట్టం వల్ల ఇండియాలో (India) నివసించేవారికి ఎలాంటి ప్రమాదం ఉండదని అన్నారు.
Chennai, February 5: దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై (Citizenship Amendment Act) నిరసనలు జరుగుతున్న వేళ సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ సూపర్‌స్టార్ రజనీ కాంత్ పౌరసత్వ సవరణ చట్టానికి (CAA)మద్ధతు తెలిపారు.
బీజేపీకి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన రజినీకాంత్
సీఏఏకి వ్యతిరేక ఆందోళనలు, అనుకూల గొంతులు ముమ్మరంగా వినిపిస్తున్న సమయంలో ఈ చట్టం వల్ల ఇండియాలో (India) నివసించేవారికి ఎలాంటి ప్రమాదం ఉండదని అన్నారు. హింసాకాండతో సమస్యలు సమసిపోవు
సీఏఏ చట్టం ఏ భారతీయ పౌరుడిని ప్రభావితం చేయదని పేర్కొన్నారు. ముఖ్యంగా ముస్లింలకు (Muslims) సీఏఏ ఎలాంటి ముప్పు ఉండదనీ, ఒకవేళ వారు ఇబ్బందులను ఎదుర్కొంటే, వారికి అండగా నిలబడే మొదటి వ్యక్తి తానే అవుతానని రజనీకాంత్ వెల్లడించారు. అలాగే జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్) చాలా అవసరమని కూడా వ్యాఖ్యానించారు. బయటివారు ఎవరో తెలుసుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. సారీ చెప్పే ప్రసక్తే లేదు
Here's ANI Tweet
భారత, పాకిస్తాన్ విభజన సందర్భంగా భారతదేశంలో ఉండటానికే నిర్ణయించుకున్న ముస్లింలను దేశం నుండి ఎలా పంపిస్తారు?" అని ఈ సందర్భంగా రజనీకాంత్ ప్రశ్నించారు. సీఏఏకి వ్యతిరేకంగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలపై ఆందోళన ఆయన వ్యక్తం చేశారు.
అమిత్ షా.. బలవంతంగా హిందీని మాపై రుద్దవద్దు
దేశ భద్రత, సంక్షేమం కోసం ప్రజలు ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలంటూ గతంలో రజనీకాంత్ విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. మోదీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై ఇప్పటివరకూ మౌనాన్ని ఆశ్రయించిన రజనీకాంత్ చివరకు మద్దతు పలకడం విశేషం.
కాగా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసనల మధ్య గత డిసెంబర్‌లో భారతదేశంలో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ తీవ‍్ర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
2021లో తమిళ ప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారు
ముఖ్యంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద 50 రోజులుగా ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.