Rajasthan Political Crisis: రాజస్థాన్ పొలిటికల్ డ్రామాలో కీలక మలుపు, బీజేపీలో చేరడం లేదని తెలిపిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్, కొనసాగుతున్న రాజస్థాన్ రాజకీయ సంక్షోభం సస్పెన్స్
కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి కొన్ని గంటల ముందు డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని ('Not Joining BJP') తెలిపారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలవబోతున్నారన్న వార్తలను మాత్రం ఆయన ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Jaipur, July 13: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభానికి (Rajasthan Political Crisis) కేంద్ర బిందువుగా మారిన సచిన్ పైలెట్ (Sachin Pilot ) కొద్ది సేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి కొన్ని గంటల ముందు డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని ('Not Joining BJP') తెలిపారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలవబోతున్నారన్న వార్తలను మాత్రం ఆయన ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మళ్లీ చక్రం తిప్పిన అమిత్ షా, మణిపూర్‌లో యూటర్న్ తీసుకున్న రెబల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి మద్దతును కొనసాగించాలని ఎన్‌పీపీ నిర్ణయం, ట్విట్టర్ ద్వారా తెలిపిన హిమాంత బిశ్వ శర్మ
గత రెండు రొజుల నుంచి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో (CM Ashok Gehlot) తీవ్రంగా విభేదించి.. బీజేపీ చేరిపోతున్నారని వార్తలొచ్చాయి. ఈ వార్తకు బలాన్నిచ్చే విధంగా బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియాతో కూడా భేటీ అయ్యారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ ఆయన సీఎం గెహ్లాట్ సర్కార్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో మకాం వేసినట్లు వార్తలు వచ్చాయి. ఎవరీ జ్యోతిరాదిత్య సింధియా, ఎందుకు కమల్ నాథ్ సర్కార్‌ని వణికిస్తున్నాడు, బీజేపీతో సింధియాకు లింకేంటి?, సింధియా పూర్తి ప్రొఫైల్‌పై విశ్లేషణాత్మక కథనం
మూడు నెలల క్రితం కాంగ్రెస్‌ను వీడిన సింధియా.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. సింధియా వెంట ఉన్న 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి బీజేపీకి మద్దతు తెలుపడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారం చేపట్టారు. బల పరీక్షకు ముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కమల్ నాథ్, మరో రాష్ట్రాన్ని బీజేపీ చేతిలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ
రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న అనిశ్చితిపై బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతిభ, సామర్థ్యానికి విశ్వసనీయత తక్కువగా ఉంటుందని విమర్శించారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్.. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ను కావాలనే పక్కకు బెట్టి, ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తన మాజీ సహచరుడు సచిన్‌ను ఇలా చూడటం బాధగా ఉందని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
Here's Jyotiraditya M. Scindia Tweet
ఇదిలా ఉంటే సంక్షోభం దిశగా పయనిస్తున్న రాజస్తాన్ రాజకీయాల్లో ఎవరి బలాన్ని వారు ప్రకటిస్తున్నారు. తన వెంట 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించగా, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, రాజస్తాన్ వ్యవహారాల ఇన్‌చార్జ్ అవినాష్ పాండే సీఎం అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని అంటున్నారు. ముఖ్యమంత్రికి 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సోమవారం తెల్లవారుజాము 2.30 గంటలకు పాండే వెల్లడించారు.
సచిన్ పైలట్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆదివారం ఓ సంచలన ప్రకటన వెలువడి రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభానికి తెరలేపింది. 30 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తున్నారనేది ఈ మెసేజ్ సారాంశం. సీఎం గహ్లోత్ నివాసంలో ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో గహ్లోత్ నాయకత్వాన్ని బలపరుస్తూ వారంతా సంతకాలు కూడా చేశారని పేర్కొన్నారు. మరికొందరు ఇతర పార్టీల, స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని తెలిపారు.
నేడు జైపూర్‌లో 10.30 గంటలకు జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీకి ఎమ్మెల్యేలంతా హాజరుకాలని విప్ జారీ చేసినట్టు ఆయన చెప్పారు. మీటింగ్‌కు గైర్హాజరు అయినవారిపట్ల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. నేటి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీలో తాను పాల్గొనటం లేదని ఆదివారం వెలువడిన వాట్సాప్ సందేశంలో సచిన్ పైలట్ పేర్కొన్నారు. దీంతో పైలట్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే పైలెట్ తాజా ప్రకటనతో ఎపిసోడ్ మళ్లీ మొదటికి చేరింది.
200 మంది ఉన్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు.
వివాదం ఎఖ్కడ మొదలైంది ?
సచిన్ పైలట్‌కు, అశోక్‌గెహ్లాట్‌కు మధ్య కొంతకాలంగా విబేధాలు ఎక్కువయ్యాయి. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఆశచూపిందని గెహ్లాట్ ఆరోపించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతున్నదంటూ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌వోజీ) పోలీసులు శుక్రవారం సీఎం, డిఫ్యూటీ సీఎం, ప్రభుత్వ చీఫ్ విప్‌తోపాటు ప్రభుత్వానికి మద్దతిస్తున్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీంతో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేతలుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదుచేశారు. దాంతో బహిరంగంగా నోటీసులు జారీ చేయటాన్ని సచిన్ పైలట్ అవమానంగా భావించారని, ఇక గెహ్లాట్ నాయకత్వంలో పనిచేసే ప్రసక్తే లేదని సచిన్ అనుకూల వర్గం ప్రకటించింది. పైలట్‌ను పీసీసీ పదవినుంచి తొలగించేందుకు గెహ్లాట్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.