New Delhi, June 24: మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి (Manipur Political Crisis) వారం రోజుల క్రితం మద్దతు ఉపసంహరించుకొన్న ‘నేషనల్ పీపుల్స్ పార్టీకి (National People's Party) చెందిన నలుగురు శాసన సభ్యులు హుటాహుటిన మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం విదితమే. బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చలు జరపడం కోసమే వారు ఢిల్లీ వచ్చారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమిత్ షాతో సమావేశమైన ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారు.
మేఘాలయా ముఖ్యమంత్రి కోర్నాడ్ సంగ్మా (Meghalaya Chief Minister Conrad Sangma) నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ, మణిపూర్ లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతును కొనసాగించాలని నిర్ణయించిందని హిమాంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో గత రాత్రి వెల్లడించారు. బీజేపీకి తొలిసారి ఎదురుదెబ్బ, సంక్షోభంలో మణిపూర్ సర్కార్, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడగా, ఆ వెంటనే రంగంలోకి దిగిన అమిత్ షా, నడ్డా (BJP chief JP Nadda and Amit Shah) పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించాయి. ఎన్పీపీ రెబల్ ఎమ్మెల్యేలు అమిత్ షాతో సమావేశమయ్యారు. అలాగే"కోర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ బృందం మణిపూర్ డిప్యూటీ సీఎం వై జాయ్ కుమార్ తో కలిసి న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. మణిపూర్ లో ప్రభుత్వానికి ఇబ్బందులు లేవు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్పీపీ తమ మద్దతును కొనసాగిస్తుంది" అని ఈ భేటీ తర్వాత హిమాంత తెలియజేశారు.
Here's Himanta Biswa Sarma Tweet
A NPP delegation led by @SangmaConrad and Dy Chief Minister of Manipur Sri Y Joy Kumar Singh met Honble President of @BJP4India Sri @JPNadda ji today in New Delhi. NPP will continue to support BJP govt in Manipur for the development of Manipur
— Himanta Biswa Sarma (@himantabiswa) June 24, 2020
కాగా, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నామని ప్రకటించడంతో బీరేన్ సింగ్ ప్రభుత్వం (Chief Minister N Biren Singh) మైనారిటీలో పడిపోయిన సంగతి తెలిసిందే. బీజేపీకి చెందిన ముగ్గురితో పాటు, ఎన్పీపీకి చెందిన నలుగురు, బయట నుంచి మద్దతిస్తున్న ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు ఈ వారం ప్రారంభంలో ప్రకటించి షాక్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడగా, బీజేపీ అధినాయకత్వం స్పందించి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేసి విజయవంతమైంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 16,922 కేసులు, దేశంలో 4,73,105కు చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య, నెల రోజుల్లోనే మూడు లక్షల యాభైవేల కేసులు నమోదు
కాగా ఈ విషయంలో అస్సాం ఆర్థిక మంత్రి హిమంత్ బిశ్వాస్ శర్మ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకునేందుకు మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు సీకే సంగ్మా, అస్సాం ఆర్థిక మంత్రి హిమంత్ బిశ్వాస్ శర్మతో కలసి ఇంపాల్‌కు వెళ్లారు. బిశ్వాస్ శర్మ బీజేపీ నాయకత్వంలోని ఈశాన్య ప్రజాతంత్ర కూటమి (ఎన్‌ఈడీఏ)కి కన్వీనర్. ఆయనకు సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దే దిట్టగా కూడా పేరుంది. నేషనల్ పీపుల్స్ పార్టీ కూడా మొన్నటి వరకు ఈ కూటమిలోనే కొనసాగింది.
సంగ్మా, శర్మాలు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులతో చర్చలు జరిపినప్పటికీ సమస్యకు పరిష్కారం కనిపించక పోవడంతో ఆ నలుగురు శాసన సభ్యులను తీసుకొని సంగ్మా, బిశ్వాన్‌లు ప్రత్యేక అద్దె విమానంలో ఢిల్లీకి బయల్దేరి వచ్చారు. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన యమ్‌నమ్ జాయ్‌కుమార్ సింగ్, ఎల్. జయంత కుమార్, లెట్‌పో హవోకిప్, ఎన్ కెయిసీలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెల్సిందే. ఢిల్లీ చర్చలు సఫలం కావడంతో వారు ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు.