Sitaram Yechury: సీపీఐ(ఎం) సీనియర్ నేత సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం.. ఢిల్లీ ఎయిమ్స్‌ లో వెంటిలేటర్‌ పై చికిత్స

ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్‌ తో బాధపడుతున్న ఆయనకు గురువారం రాత్రి వెంటిలేటర్‌ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Sitaram Yechury (Credits: X)

Newdelhi, Sep 6: సీపీఐ(ఎం) (CPI(M)) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్‌ తో బాధపడుతున్న ఆయనకు గురువారం రాత్రి వెంటిలేటర్‌ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏచూరి వయసు 72 సంవత్సరాలు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌ లోని ఎమర్జెన్సీ వార్డులో చేరారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూకి తరలించాల్సి వచ్చింది. ఒక ప్రత్యేక వైద్యుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ పెట్టింది పేరు, గ్లోబల్‌ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని వెల్లడి

ఆందోళనలో అభిమానులు

న్యుమోనియా లాంటి ఇన్ఫెక్షన్‌ తో ఏచూరి బాధపడుతున్నారని సమాచారం. అయితే చికిత్సకు సంబంధించిన వివరాలను హాస్పిటల్ ప్రకటించలేదు. దీంతో ఏచూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క