Haryana Election Results: హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ.. క్షణక్షణానికి మారుతున్న ఫలితాల సరళి (లైవ్)
ఇక్కడ భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతోంది.
Newdelhi, Oct 8: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల (Haryana Elections) ఓట్ల లెక్కింపులో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య తీవ్రమైన హోరాహోరీ పోటీ కొనసాగుతోంది. రిజల్ట్స్ క్షణక్షణానికి మారుతున్నాయి. తొలుత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. రాష్ట్రంలోని 90 సీట్లలో 63 చోట్ల ముందంజలో కొనసాగగా.. బీజేపీ 23 స్థానాలకు పరిమితమైంది. అయితే కాసేపటికే అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. బీజేపీ లీడింగ్ లో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ కాస్త వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవకపోవడం గమనార్హం.
Live Video:
మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్
ఈ నెల 5న ఒకే విడుతలో జరిగిన ఎన్నికల్లో 67.09 శాతం పోలింగ్ నమోదయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ దాటాల్సి ఉంటుంది. మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీచేశారు.