Vijayasai Reddy: జగన్‌ ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు..ఆయనకు నమ్మకద్రోహం చేయను అన్న విజయసాయి రెడ్డి, బీజేపీ నుండి గవర్నర్ పదవి హామీ తీసుకోలేదని స్పష్టం

నాలాంటి వాళ్లు ఇంకో వెయ్యి మంది వైసీపీ(YSRCP)ని వీడినా జగన్ కు ఉన్న ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు అన్నారు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy).

Vijayasai Reddy speech after Resigns as Rajya Sabha Member(video grab)

Delhi, January 25:  నాలాంటి వాళ్లు ఇంకో వెయ్యి మంది వైసీపీ(YSRCP)ని వీడినా జగన్ కు ఉన్న ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు అన్నారు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy). ఢిల్లీ(Delhi)లో రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన అనంతరం మాట్లాడిన విజయసాయి రెడ్డి.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను అన్నారు. రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నాను అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి(Jagan) అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు.. నాలాంటి వాళ్లు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకు ఉన్న ప్రజాదరణ తగ్గదు అన్నారు. రాజీనామా చేయొద్దు, మేము, పార్టీ అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. రాజీనామా అంశం సరికాదు, పునరాలోచించాలని జగన్ సూచించారు అన్నారు. నా రాజీనామా కూటమి కే లబ్ది..నా ప్రాతినిధ్యాన్ని ఎవరు తక్కువ చేయలేరు అన్నారు.

వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా అన్నారు. లండన్ లో ఉన్న జగన్ తో అన్ని అంశాలు మాట్లాడాకే నా రాజీనామాను అందించా..రాజకీయాలనుంచి తప్పుకున్నా, ఇక రాజకీయాల గురించి మాట్లాడను అన్నారు. తాను ఏరోజు అబద్దాలు చెప్పలేదు.. నాలుగు దశాబ్దాలుగా జగన్ తో, ఆయన కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నారు.

ఆయనతో ఎప్పుడూ విభేదాలు లేవు, భవిష్యత్ లో రావు అన్నారు. అప్రూవర్ గా మారాలని ఎన్నో ఒత్తిడులు వచ్చిన నేను తలవంచలేదు, అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఎదురైయ్యాయి...అయిన నేను జగన్ కు నమ్మకద్రోహం చేయను అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక నాపై కేసు నమోదు చేశారు. లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు.విక్రాంత్ రెడ్డి ని నేను పంపించలేదు, కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో నా ప్రమేయం లేదు అన్నారు.  రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేత

విక్రాంత్ రెడ్డి ని కేవీ రావు(KV Rao) కు నేను పరిచయం చేయలేదు.. నాకు వ్యాపారాలు లేవు, దేనిలో నేను భాగస్వామిని కాదు అన్నారు. వ్యాపార లావాదేవీలు నాతో నా వియ్యంకుడు ఎప్పుడు చర్చించరు, వారి వ్యాపారాల గురించి నాకు తెలియదు.రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను బలహీనుడిగా మారుతాను, నన్ను ఎందుకు కేసుల నుంచి తప్పిస్తారు? అన్నారు.

రాజకీయాల్లో నా పాత్రకు న్యాయం చేయలేను అనే రాజకీయలనుంచి దూరం అవుతున్నా.. కేసులకు భయపడే తత్వం నాది కాదు, దేన్నైనా దైర్యంగా ఎదుర్కుంటా అన్నారు. గవర్నర్ పదవి కానీ, బీజేపీ నుంచి ఎంపీ పదవి కానీ నేను ఎవరిదగ్గర హామీ తీసుకోలేదు.. బెంగళూరు, విజయవాడలో ఒక ఇల్లు, వైజాగ్ లో ఒక అపార్ట్మెంట్ ఇవే నా ఆస్తులు అన్నారు. నీతిగా, నిజాయితీ గా బతకాలని అనుకున్నా, కొన్ని ఛానెల్స్ నాపై అవినీతిపరుడనే ఆరోపణలు చేశాయి.. ఛానెల్ పెట్టె అంశంపై పునరాలోచన చేస్తానన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Amit Shah Takes Holy Dip at Triveni Sangam: వీడియోలు ఇవిగో, త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన హోమంత్రి అమిత్ షా, మహాకుంభమేళాలో ఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు

SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి

Dasoju Sravan Slams Revanth Reddy: రేవంత్ రెడ్డిది ఫాక్షన్‌ మనస్తత్వం బీఆర్ఎస్‌ నేత దాసోజు శ్రావణ్ ఫైర్, యావత్ తెలంగాణను అవమానించిన రేవంత్ రెడ్డి..ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

CM Revanth Reddy On Osmania University: 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాం..వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి

Share Now