'No Yes Bank': యస్ బ్యాంకు సంక్షోభం, ప్రధాని మోదీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ, భారత ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కార్ నాశనం చేస్తోందని విమర్శలు, డిపాజిటర్ల డబ్బు సురక్షితంగానే ఉందన్న ఆర్థికమంత్రి
అధికార పార్టీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi) కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. నరేంద్ర మోదీ సర్కార్ (Narendra Modi government) భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. ‘యస్ బ్యాంక్ కాదు..మోదీ ఆయన ఆలోచనా విధానాలు ఆర్థిక వ్యవస్థను పతనం బాటన పయనింపచేస్తున్నాయని ఆరోపించారు.
New Delhi, Mar 06: యస్ బ్యాంకు సంక్షోభం (Yes Bank crisis) దేశంలో ప్రకంపనలను రేకెత్తిస్తోంది. అధికార పార్టీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi) కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. నరేంద్ర మోదీ సర్కార్ (Narendra Modi government) భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. ‘యస్ బ్యాంక్ కాదు..మోదీ ఆయన ఆలోచనా విధానాలు ఆర్థిక వ్యవస్థను పతనం బాటన పయనింపచేస్తున్నాయని ఆరోపించారు.
అత్యాచారాల రాజధానిగా భారత్ : రాహుల్ గాంధీ
యస్ బ్యాంక్ కార‍్యకలాపాలపై ఆర్బీఐ (RBI) మారటోరియం, నెలకు ప్రతి ఖాతాకూ రూ 50,000 వరకూ విత్‌డ్రాయల్ పరిమితి విధించడం వంటి ఆంక్షల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు యస్ బ్యాంక్ నిర్వాకంతో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక సంస్థలను ఎలా నియంత్రిస్తున్నదో తేటతెల్లమైందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు.
Here's Rahul gandhi Tweet
మొదట పీఎంసీ బ్యాంక్...ఇప్పుడు యస్ బ్యాంక్ రేపు మూడో బ్యాంక్ సంక్షోభానికి సిద్ధంగా ఉందా అని వరుస ట్వీట్లలో ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోందా..? ఇంత జరిగినా మోదీ సర్కార్ ఏమైనా పట్టించుకుంటోందా..? అంటూ చిదంబరం నిలదీశారు.
ప్రధానమైన సమస్యల నుండి దేశం దృష్టి మరల్చడమే మోదీ స్టైల్
ఇదిలా ఉంటే యస్ బ్యాంకు డిపాజిటర్లకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) హామీ ఇచ్చారు. డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. డిపాజిటర్లు, బ్యాంకు ప్రయోజనాల నేపథ్యంలో ఆర్బీఐ ఓ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. యెస్ బ్యాంకు సంక్షోభాన్ని త్వరలోనే పరిష్కరించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తనకు హామి ఇచ్చినట్లు ఆమె చెప్పారు. ఆర్బీఐతో పాటు ప్రభుత్వం కూడా యెస్ బ్యాంకు కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. నెలకు కేవలం 50 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలని యెస్ బ్యాంకు డిపాజిటర్లకు ఆర్బీఐ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసందే.
చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు అస్సాంలో సాగవు
యస్ బ్యాంకును కష్టాలను గట్టేక్కించేందుకు ఆర్బీఐ (RBI) నెలరోజుల పాటు పలు ఆంక్షలు విధించింది. 30రోజుల పాటు బ్యాంకు నుంచి క్యాష్ విత్ డ్రాలపై పరిమితి పెట్టింది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్న ఆర్బీఐ ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బ్యాంకు నుంచి ఎలాంటి లోన్లు జారీ చేయోద్దని ఆర్బీఐ తెలిపింది. ఉద్యోగుల జీతాలు, చెల్లింపులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఎస్ బ్యాంక్ బోర్డును కూడా రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఎస్బీఐ చేత యస్ బ్యాంక్ వాటాల కోనుగోలుకు ప్రయత్నాలు చేస్తోంది.