New Liquor Rates in AP: ఇంకా అందుబాటులోకి రాని రూ.99కే క్వార్టర్ బాటిల్, ఏపీలో కొత్త లిక్కర్ ధరల పూర్తి సమాచారం ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే! ఈ మేరకు సోమవారం లాటరీల్లో కేటాయించిన షాపుల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి.
Vjy, Oct 16: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే! ఈ మేరకు సోమవారం లాటరీల్లో కేటాయించిన షాపుల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో ఏపీలో నూతన మద్యం విధానం ద్వారా ఓపెన్ అయిన షాపుల్లో లిక్కర్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలో కొత్త రేట్లు ఎలా ఉన్నాయనేది ఓ సారి చూస్తే..
ముందుగా విస్కీల విషయానికొస్తే... సథరన్ బ్లూ ఎలైట్ విస్కీ క్వార్టర్ ధర రూ.150.. బీ10 ఒరిజినల్ బ్లెండెడ్ విస్కీ క్వార్టర్ రూ.320.. ఆఫీసర్ ఛాయిస్ క్వార్టర్ రూ.150.. బీ7 క్లాసిక్ బ్లెండెడ్ విస్కీ క్వార్టర్ రూ.230.. రాయల్ స్టాగ్ విస్కీ క్వార్టర్ రూ.230.. బ్లెండర్స్ ప్రైడ్ క్వార్టర్ రూ.360.. 100 పైపర్స్ క్వార్టర్ రూ.670.. రాయల్ గ్రీన్ క్వార్టర్ రూ.220.. రాయల్ స్టాగ్ క్వార్టర్ రూ.230 గా ఉంది. ఇక గోల్డెన్ స్ట్రిప్స్ విస్కీ క్వార్టర్ రూ.210.. మెక్ డొవెల్స్ నెం.1 విస్కీ క్వార్టర్ రూ.180.. రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ రూ.230.. 8పీఎం క్వార్టర్ రూ.230.. ఆల్ సీజన్స్ క్వార్టర్ రూ.210.. ఆస్ట్రోకార్ట్ ప్రీమియం క్వార్టర్ రూ. 230.. టీచర్స్ 50 క్వార్టర్ రూ.990.. గా విస్కీల ధరలు ఉన్నాయి!
బ్రాందీల ధరల విషయానికొస్తే... కైరోన్ రేర్ క్వార్టర్ రూ.300.. కింగ్స్ వెల్ క్వార్టర్ రూ.150.. కొరియర్ నెపోలియన్ క్వార్టర్ రూ.300.. మేన్సన్ హౌస్ క్వార్టర్ రూ.220.. మెన్సన్ హౌస్ ఆరెంజ్ క్వార్టర్ రూ.240.. మేన్సన్ హౌస్ గ్రీన్ ఆపిల్ క్వార్టర్ రూ.240.. మార్ఫస్ ఎక్స్వో క్వార్టర్ రూ.290.. రాయల్ ప్యాలెస్ ఫుల్ రూ.590.. గా ఉన్నాయి.
రమ్ విషయానికొస్తే... ఓల్డ్ మంక్ ఎగస్ట్రా స్పెషల్ క్వార్టర్ రూ.230.. ఓల్డ్ మంక్ గోల్డ్నె రిసర్వ్ క్వార్టర్ రూ.270.. బకర్డీ కార్టా క్వార్టర్ రూ.330.. గా ఉన్నాయి. ఇక మేజిక్ మూమెంట్ వొడ్కా క్వార్టర్ రూ.230 కాగా.. జునో సుపీరియర్ పింక్ వొడ్కా క్వార్టర్ రూ.270 గా ఉంది.
బీర్ల ధరల విషయానికొస్తే... బ్లాక్ బాస్టర్ రూ.220.. కార్ల్స్ బెర్గ్ రూ.260.. కింగ్ ఫిషర్ రూ.200.. కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ రూ.220.. బ్రిటీష్ ఎంఫైర్ రూ.220.. ఫోస్టర్స్ రూ.220 గా ఫిక్స్ చేశారు. దీంతో... గత ప్రభుత్వలో ఉన్న ధరలనే కంటిన్యూ చేశారు కాకపోతే వాటితో పాటు పాత బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయని వాపోతున్నారు మందు బాబులు!. అయితే... రూ.99కే క్వార్టర్ బాటిల్ అని ఎదురు చూసినవారికి మాత్రం నిరాశే ఎదురైంది. ఇంకా ఆ బ్రాండ్స్ రాలేదని వైన్ షాపుల యజమానులు చెబుతున్నారట.