Jai Srinivas & Cartoonist Gopi Dies: వారిద్దరి మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం, కరోనాతో కన్నుమూసిన జైశ్రీనివాస్‌, కోవిడ్‌ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ప్రముఖ చిత్రకారుడు గోపి

దివంగత గోపి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

RIP

ప్రముఖ తెలంగాణ సింగర్‌ నేరేడుకొమ్మ శ్రీనివాస్‌ అలియాస్‌ జైశ్రీనివాస్‌ కరోనాతో పోరాడి కన్నుమూశారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన శుక్రవారం సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌లో అనేక సూపర్ హిట్ సిమాలకు శ్రీనివాస్ ఎన్నో పాటలు పాడారు. సినిమా పాటలతోనే కాకుండా.. ప్రైవేట్ ఆల్బమ్‌లకు, షార్ట్ ఫిలింలకు, వెబ్ సిరీస్‌లకు పాటలు పాడారు. శ్రీనివాస్‌ దాదాపు 200కి పైగా పాటలు పాడారు.

‘ఒంగోలు గిత్త’, ‘జెండాపై కపిరాజు’ వంటి సినిమాల్లోని పాటలకు శ్రీనివాస్‌ గాత్రం అందించారు. శ్రీనివాస్‌ మృతి (Jai Srinivas Dies) పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. జై’ సినిమాలోని ‘దేశం మనదే..తేజం మనదే...’ పాటతో ప్రాచుర్యం పొందారు. గాయకుడు జై శ్రీనివాస్‌ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.శ్రీనివాస్ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా, తోటి సింగర్‌లకు తీరని లోటని అన్నారు.

తెలుగు చిత్ర సీమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత బీఏ రాజు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పలువురు సినీ ప్రముఖులు

ప్రముఖ చిత్రకారుడు గోపి కరోనాతో కన్నుమూత: నాలుగు దశాబ్దాలకు పైగా కాన్వాస్‌పై తన బొమ్మలతో తెలుగు సాహిత్య, చిత్ర సీమను హోయలు పలికించి తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ చిత్రకారుడు గోపి (లూసగాని గోపాల్‌గౌడ్‌ 69) శుక్రవారం కోవిడ్‌తో (Cartoonist Gopi Death) కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలతో పాటు మధుమేహంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కోవిడ్‌ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Here's TS CMO Tweet

నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్ గా కార్టూనిస్ట్ గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచిన పాలమూరుకు చెందిన గోపి మరణంతో, తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దివంగత గోపి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.