Helicopter Spins.. Watch Video: ఆకాశంలో 175 సార్లు రివర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొన్న స్కై సర్ఫర్.. రోమాలు నిక్కబొడిచేలా వీడియో
అలాంటిది ఆకాశంలో రివర్స్ లో రొటేటర్‌లా తిరగడం.. ‘హే క్రేజీ’ అనుకుంటున్నారా. క్రేజీనే కాదు క్రేజీయెస్ట్... కూడా. ఎందుకంటే అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 175 స్పిన్స్ తిరిగిన కీత్ కెబె అనే వ్యక్తి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Newyork, August 27: స్కై డైవింగ్ (Sky Diving) అంటేనే సాహసం. కొద్దిసేపు ఊపిరి ఆడనట్టు అనిపించినా.. ఆ తరువాత ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తుంటే వచ్చే థ్రిల్ (Thrill) అనుభవిస్తే కానీ తెలియదు. అలా ఆకాశంలో తలకిందులుగా వేలాడుతూ హెలికాప్టర్ (helicopter) స్పిన్స్ కొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు యూఎస్‌కు చెందిన ఓ స్కై సర్ఫర్ (Skysurfer). నేలమీద చుట్టూ తిరిగితేనే కళ్లు గిర్రున తిరిగి మైకం వచ్చేస్తుంది. అలాంటిది ఆకాశంలో రివర్స్ లో రొటేటర్‌లా తిరగడం.. ‘హే క్రేజీ’ అనుకుంటున్నారా. క్రేజీనే కాదు క్రేజీయెస్ట్... కూడా. ఎందుకంటే అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 175 స్పిన్స్ తిరిగిన కీత్ కెబె రికార్డు బ్రేక్ చేశాడు.
రౌడీ హీరో కొత్త చిత్రం లైగర్ ఓటీటీలోకి.. డీల్ పూర్తి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో సింగిల్ జంప్‌లో కెబె 165 స్పిన్స్ చేశాడు. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.