Hyderabad, August 27: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే (Ananya Pandey) జంటగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ 'లైగర్' (Liger). బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య గురువారం విడుదలై.. ప్రేక్షకుల అంచనాలను రీచ్‌ కాలేకపోయింది. తాజాగాఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది.

షాకింగ్ వీడియో, థియేటర్ నుంచి బాధతో బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ, కాలర్ ఎగరేసే రోజులు వస్తాయని ఓదారుస్తున్న అభిమానులు

ఈ సినిమా ఓటీటీ హక్కులను 85 కోట్లకు డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+HotStar) సొంతం చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా కొత్త సినిమాలు 50రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నాయి. దీన్ని బట్టి అక్టోబర్‌ తొలివారంలో లైగర్‌ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది.