Weather Forecast: నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు, రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు వరకు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

రుతుపవన ద్రోణి పశ్చిమ నుంచి క్రమంగా ఉత్తరం వైపునకు మారే అవకాశం ఉందని దీనివల్ల పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది.

Weather report: Heavy rains likely in Andhra Pradesh for next two days (Photo-Twitter)

Mumbai, August 24: రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి నాలుగురోజుల పాటు భారీవర్షాలు (Weather Forecas) కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవన ద్రోణి పశ్చిమ నుంచి క్రమంగా ఉత్తరం వైపునకు మారే అవకాశం ఉందని దీనివల్ల పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాల్లో ఆగస్టు 26,27 తేదీల్లో అక్కడక్కడ భారీవర్షాలు (Maharashtra, Gujarat To Experience Dry Weather Till August 28) కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

ఆగస్టు 27వతేదీ వరకు బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్ోల విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. బుధవారం వరకు అసోం, మేఘాలయ ప్రాంతాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.ఆగస్టు 27వతేదీ వరకు ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయన్ ప్రాంతాలు, పశ్చిమబెంగాల్ లలో భారీవర్షం కురుస్తుందని అధికారులు హెచ్చరించారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీవర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తన బులెటిన్ లో వివరించింది.

బంగాళాఖాతంలో భారీ భూకంపం, చెన్నైలో స్వల్పంగా కంపించిన భూమి, ఆంధ్రప్రదేశ్‌ పై భూకంపం ఎటువంటి ప్రభావం చూపలేదని తెలిపిన రాష్ట్ర విపత్తులశాఖ

ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో చెన్నైలో స్వల్పంగా భూమి కంపించింది. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ పై భూకంపం ఎటువంటి ప్రభావం చూపలేదని రాష్ట్ర విపత్తులశాఖ తెలిపింది.