Case on Youtube: యూట్యూబ్‌లో సెక్స్‌ వీడియోలు చూసి ఫెయిలయ్యా! నాకు రూ. 75 లక్షలు పరిహారం చెల్లించాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్, ఇలాంటి చెత్త కేసులు వేయొద్దంటూ రూ. 25వేలు ఫైన్ వేసిన అత్యున్నత న్యాయస్థానం

75 లక్షలు చెల్లించాలంటూ దావా వేశాడు. యూట్యూబ్ వీడియోల్లో (Youtube videos) వచ్చిన లైంగిక యాడ్స్‌ వల్ల తన దృష్టి మళ్లిందని, ఏకాగ్రత దెబ్బతిన్నదని, దీంతో ఉద్యోగ పరీక్షలో విఫలమైనట్లు ఆరోపించాడు. అలాగే సోషల్ మీడియాలో న్యూడ్‌ కంటెంట్‌పై (Nude Content) నిషేధం విధించాలని కోరాడు.

YouTube| Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, DEC 09: కరోనా తర్వాత ఆన్‌లైన్ చదువులు (Online Studies) పెరిగిపోయాయి. దీంతో పెద్దవాళ్ల నుంచి చిన్నారుల వరకు ఫోన్ కామన్ అయినపోయింది. అయితే అలా ఆన్‌లైన్ చదువుల్లో భాగంగా యూట్యూబ్ మీద ఆధారపడ్డ ఓ వ్యక్తి...అదే యూట్యూబ్ మీద ఏకంగా సుప్రీంకోర్టులో కేసు వేశాడు. యూట్యూబ్ వల్ల తాను పరీక్షల్లో ఫెయిలయ్యానని, అందుకే తనకు రూ. 75 లక్షలు చెల్లించాలంటూ దావా వేశాడు. యూట్యూబ్ వీడియోల్లో (Youtube videos) వచ్చిన లైంగిక యాడ్స్‌ వల్ల తన దృష్టి మళ్లిందని, ఏకాగ్రత దెబ్బతిన్నదని, దీంతో ఉద్యోగ పరీక్షలో విఫలమైనట్లు ఆరోపించాడు. అలాగే సోషల్ మీడియాలో న్యూడ్‌ కంటెంట్‌పై (Nude Content) నిషేధం విధించాలని కోరాడు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఆ వ్యక్తికి చీవాట్లు పెట్టింది. పనికిమాలిన పిటిషన్‌ వేసినందుకు రూ.25,000 జరిమానా కూడా విధించింది.

MP Ravi Kishan on Population Control: కాంగ్రెస్ వల్లనే నాకు నలుగురు పిల్లలు, అందుకు ఇప్పుడు బాధపడుతున్నా! టీవీ చర్చలో వింత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ 

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆనంద్ కిషోర్ చౌదరి, ఆ రాష్ట్ర పోలీస్‌లో చేరేందుకు పోటీ పరీక్షకు ప్రిపేర్‌ అయ్యాడు. ప్రిపరేషన్‌ కోసం యూట్యూబ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నాడు. అయితే యూట్యూబ్‌ వీడియోల్లో వచ్చిన లైంగిక యాడ్స్‌ (Sex ads) వల్ల తన ఏకగ్రత దెబ్బతిన్నదని, దృష్టి మళ్లిందని అతడు ఆరోపించారు. దీని వల్ల పోలీస్‌ ఉద్యోగ పరీక్షలో విఫలమైనట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ నుంచి రూ.75 లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు.

Karnataka Shocker: టీచర్ పాడుబుద్ధి, విద్యార్థిని మొబైల్‌కు ఆ వీడియోలు, హనీమూన్‌‌లో అలా చేసుకుందామంటూ ఛాటింగ్, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు 

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, ఏఎస్‌ ఓకాలతో కూడిన ధర్మాసనం ఆనంద్‌ కిషోర్‌ పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. తన వాదన వినిపించేందుకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన అతడికి చీవాట్లు పెట్టింది. ‘ఇంటర్నెట్‌లో ప్రకటనలు చూసినందున నష్టపరిహారం కావాలా? దాని కారణంగా మీ దృష్టి మళ్లినందుకు పరీక్షలో విజయం సాధించలేకపోయారా?’ అని ప్రశ్నించింది. ‘అలాంటి ప్రకటనలు నచ్చకపోతే, చూడకండి’ అని బెంచ్ పేర్కొంది.

మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇది ఒకటని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పబ్లిసిటీ కోసం వేసే ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని మండిపడింది. అంతేగాక పిటిషనర్‌ ఆనంద్ కిషోర్‌కు తొలుత లక్ష జరిమానా విధించింది. అయితే కోర్టుకు క్షమాపణలు చెప్పిన అతడు తాను నిరుద్యోగినని, జరిమానా విధించవద్దని కోరాడు. స్పందించిన సుప్రీంకోర్టు, లక్షకు బదులు రూ.25,000 జరిమానా చెల్లించాలని అతడ్ని ఆదేశించింది.