MP Ravi kishan (Photo Credits PTI)

New Delhi, DEC 09: జనాభా నియంత్రణలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవ్వడం వల్లనే తనకు నలుగురు పిల్లలు ఉన్నారని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ (MP Ravi Kishan). ఓ టీవీ చర్చలో ఆయన ఈ కామెంట్లు చేశారు. తనకు నలుగురు పిల్లలు ఉండటం తన తప్పు కాదన్నారు. జనాభా నియంత్రణ బిల్లు (Population Control Bill) తీసుకురాని కాంగ్రెస్‌దే ఆ తప్పని చెప్పారు. ఆ బిల్లు ఉంటే తనకు తక్కువగా పిల్లలు ఉండేవారని అన్నారు. తాను నలుగురు పిల్లలను కనడానికి గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌దే (Congress) తప్పని టీవీ చర్చలో వాదించారు. ఆ పార్టీ జనాభా నియంత్రణ బిల్లు తీసుకురాలేదని, దీని వల్లనే తనకు ఎక్కువ మంది సంతానం కలిగారని చెప్పారు. ఒక వేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లు తెచ్చి ఉంటే తనకు తక్కువగా పిల్లలు ఉండేవారని అన్నారు.

జనాభా విస్ఫోటనం గురించి తాను ఇప్పుడు ఆందోళన చెందుతున్నానని, తనకు నలుగురు పిల్లలు ఉండటంపై పశ్చాత్తాపం చెందుతున్నా అంటూ అని వ్యాఖ్యానించారు. మరోవైపు జనాభాను చైనా నియంత్రించిందంటూ బీజేపీ ఎంపీ రవికిషన్‌ ఆ దేశాన్ని పొగిడారు. చైనా మాదిరిగా గత ప్రభుత్వాలు ఆలోచించి ఉంటే తరతరాల వారికి కష్టాలు ఉండేవి కావన్నారు. దీనిపై చర్చించడం ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీస్తుందని తెలిపారు. అయితే ఇలాంటి చట్టాల ఫలితం 20-25 ఏళ్ల తర్వాత స్ట్రాంగ్‌ గా ఉంటుందని అన్నారు.