Rottela Panduga 2022: నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ, ఈ నెల 13 వరకు జరగనున్న వేడుక, భక్తుల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైన బారాషహీద్ దర్గా
కుల, మతాలకు అతీతంగా, మతసామరస్యానికి ప్రతీకగా ఏటా ప్రతిష్టాత్కకంగా జరిగే రొట్టెల పండగ (Rottela Panduga 2022) మంగళవారం నుంచి మొదలైంది. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన (Rottela Panduga begins in Nellore) పండగ 13వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనుంది.
Nellore, august 10: కుల, మతాలకు అతీతంగా, మతసామరస్యానికి ప్రతీకగా ఏటా ప్రతిష్టాత్కకంగా జరిగే రొట్టెల పండగ (Rottela Panduga 2022) మంగళవారం నుంచి మొదలైంది. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన (Rottela Panduga begins in Nellore) పండగ 13వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనుంది. రెండేళ్ల విరామం తర్వాత జరుగుతున్న పండగ కావడంతో దేశ, విదేశాల నుంచి ఈ ఏడాది భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని బారాషహీద్ దర్గా (Bara Shaheed Dargah ) యాజమాన్యం తెలిపింది . రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు చెందిన భక్తులు తొలిరోజు భారీగా హాజరయ్యారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Minister Kakani) మంగళవారం బారాషహీద్ దర్గా ప్రాంగణాన్ని సందర్శించారు. రొట్టెల పండగకు హారయ్యే భక్తుల సౌకర్యాలు, ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీసుశాఖ ఏర్పాటు చేసినా సీసీ కెమెరాల మానిటరింగ్ కేంద్రం నుంచి అన్నీ ప్రాంతాలను పరిశీలించారు. భక్తులు రద్దీ పెరిగితే అందుకు తగ్గట్లు సౌకర్యాలు నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
ఈ చెట్లను ఇంటి ఆవరణలో నాటితే మీ ఇంటికి లక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లే, ఏ మొక్కలో తెలుసుకోండి.
పటిష్ట ఏర్పాట్లపై కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయారావు, నగర పాలక సంస్థ కమిషనర్ హరితను అభినందించారు. రాబోయే ఏడాదిలో శాశ్వత అభివృద్ధి పనులు పూర్తి చేసి రొట్టెల పండగ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల విశ్వాసానికి తగ్గట్లుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అభినందించారు. ఎమ్మెల్యే చొరవతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహణకు రూ.15 కోట్లకు ప్రభుత్వం అనుమతి లభించిందని మంత్రి తెలిపారు.
స్వర్ణాల చెరువు ఘాట్‌లో భక్తుల సౌకర్యార్థ్యం వివిధ కోర్కెల రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, సౌభాగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం, ధనం రొట్టెల ఘాట్‌ల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో భక్తులు ఏ కోర్కెతో రొట్టెను తీసుకున్నారో.. ఆ కోర్కె తీరితే తిరిగి రొట్టెను వదలాల్సి ఉంది. ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు ఆరోగ్య రొట్టెను తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఆరోగ్య రొట్టెకు డిమాండ్ పెరిగినట్లు భక్తులు చర్చించుకుంటున్నారు.
బారాషహీద్ దర్గాలో భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ నేతృత్వంలోనే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రులు మెడికేర్, అపోలో, కిమ్స్, యశోద యాజమాన్యాలు రెడ్‌క్రాస్, ఆయూష్ విభాగాలు ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచారు.
రొట్టెల పండగ తొలి రోజు సంప్రదాయంగా మంగళవారం రాత్రి అమరులైన 12 మంది యోథులను స్మరిస్తూ దర్గా ప్రాంగణంలో బారాషహీద్‌ల సమాధుల చెంత షహదత్ (ప్రత్యేక ప్రార్థనలు) నిర్వహించారు. షహదత్‌లో భాగంగా 12 మంది వీరుల సమాధులను మత పెద్దలు రాత్రి 11.30 నుంచి 2 గంటల వరకు గులాములు, పన్నీరుతో శుభ్రం చేసి అనంతరం గంధం లేపనం చేసి ‘సొందల్ మాలి’ నిర్వహించారు.
రొట్టెల పండగలో భాగంగా రెండో రోజు బుధవారం రాత్రి బారాషహీద్‌ల గంధమహోత్సవం జరగనుంది. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి సంప్రదాయంగా గంధాన్ని తీసుకువచ్చి బారాషహీద్‌లకు లేపనం చేస్తారు. అనంతరం భక్తులకు ఆ గంధాన్ని, ప్రసాదాన్ని పంచి పెడతారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)