Astrology: ఆగస్టు 26 కృష్ణాష్టమి రోజున అరుగుదైన ఐదు యోగాల కలయిక..ఈ 5 రాశులు వారికి అదృష్టం.

ఈ సందర్భంగా ఐదు యోగాలు ఒకేరోజు ఏర్పడడం చాలా విశేషం. జయంతి యోగం, సర్వసిద్ధి యోగం, హర్షణయోగం, శివయోగం, గజకేసరి యోగం కలయిక.

astrology

ఈసారి కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీ సోమవారం  వచ్చింది. ఈ సందర్భంగా ఐదు యోగాలు ఒకేరోజు ఏర్పడడం చాలా విశేషం. జయంతి యోగం, సర్వసిద్ధి యోగం, హర్షణయోగం, శివయోగం, గజకేసరి యోగం కలయిక. ఈ ఐదు యోగాలు కలయిక గొప్ప యాదృచ్ఛికం. కనుక ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఐదు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ 5రాశులు ఏంటో తెలుసుకుందాం.

మీన రాశి: శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల మీన రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పెరుగుతుంది. మీ ప్రతిభను గుర్తించి అభినందిస్తారు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. వ్యాపార రంగంలో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వ్యాపారాలను ఏర్పరచడానికి సన్నాహాలు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు ప్రేమ వివాహాలకు అనుకూలం.

మేషరాశి: ఈ రాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులు ప్రాజెక్టులలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు విదేశీ పర్యటనలు చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మీ ఉద్యోగ సంపాదనల పెరుగుతుంది. విద్యార్థులు వారి శ్రమకు తగ్గ ఫలితాలు. సాధిస్తారు కొత్త వ్యక్తులు కలవడం వల్ల మీ వ్యాపార విస్తరణ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళ్తారు.

Astrology: బద్రినాథ్ కు అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే

కన్యా రాశి: ఈ రాశి వారికి ప్రేమించిన అమ్మాయి తో వివాహాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం సాధారణ సాధించాలి. అనుకునే యువత కల నెరవేరుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.

మకర రాశి: ఈ రాశి వారికి పని వారం తగ్గుతుంది. విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనేక వైపుల నుండి మీకు ధన లాభం జరుగుతుంది. కొత్త కారు కొనాలనుకున్న మీ కథ నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే లాభాలు అధికంగా ఉంటాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కోర్టు పెండింగ్ లో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా బాగుంటారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



సంబంధిత వార్తలు