Astrology: అక్టోబర్ 28న గురుడు రోహిణి నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశులు వారికి అదృష్టం..

అయితే కొన్నిసార్లు రాసి మార్పు వల్ల అన్ని వారి రాశులు పైన ప్రభావాలు ఉంటాయి. అయితే అక్టోబర్ 28న మధ్యాహ్నం ఒంటిగంటకు గురు గ్రహం రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే కొన్నిసార్లు రాసి మార్పు వల్ల అన్ని వారి రాశులు పైన ప్రభావాలు ఉంటాయి. అయితే అక్టోబర్ 28న మధ్యాహ్నం ఒంటిగంటకు గురు గ్రహం రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి-  కన్యా రాశి వారికి అక్టోబర్ 28న గురుగ్రహం రోహిణి నక్షత్రంలోనికి సంచారం కారణంగా శుభ సమయం ప్రారంభమవుతుంది. వీరి జీవితాలలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దీనివల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఎప్పటినుంచో మీ శత్రువులు మీపైన తప్పుడు ప్రచారం చేసిన వారు ఇప్పుడు మిత్రులు అవుతారు. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది .దీనివల్ల తల్లిదండ్రులలో సంతోషం వస్తుంది.

ధనస్సు రాశి- ధనస్సు రాశిలో జన్మించిన వారికి గురుగ్రహం రాశి మార్పు కారణం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. వీరు అక్టోబర్ 28 నుండి అన్ని లగ్జరీ ప్రయోజనాలు పొందుతారు. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పనిలో ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. రానున్న రోజులు మీకు చాలా విలువైనవి. మీ సంపదను పెంచుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపరులుతాయి. దీని ద్వారా కుటుంబంలో మీ గౌరవం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకునే కళ నెరవేరుతుంది.

Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి కూడా గురు గ్రహం రాశి మార్పు చాలా లాభాలను ఇస్తుంది మీ వీరి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మికంగా ధన లాభం వస్తుంది. దీని ద్వారా మీ సంపదలో పెరుగుదల ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీని వల్ల సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.