Astrology: నవంబర్ 16వ తేదీ చంద్రుడు, గురు గ్రహం కలయిక వల్ల గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

గురు గ్రహం కూడా ఇప్పటికే వృషభ రాశిలో ఉంది. దీని కారణంగా అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 16వ తేదీన చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. గురు గ్రహం కూడా ఇప్పటికే వృషభ రాశిలో ఉంది. దీని కారణంగా అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. అయితే నవంబర్ 16వ తేదీ శనివారం నాడు చంద్రుడు మధ్యాహ్నం మూడు గంటల 15 నిమిషాలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత అదే రోజున గురుగ్రహం కూడా వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. గురు గ్రహం చంద్రగ్రహణం కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. మూడు రాశులు వారికి చాలా మేలు జరుగుతుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి చంద్రుడు ,గురు గ్రహ కలయిక వల్ల గజకేసరి యోగం అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండిటి కలయిక వల్ల గజకేసర యోగం ఏర్పడుతుంది. ఇది వ్యాపారంలో పురోగతికి ,కొత్త అవకాశాలకు ఇస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వ్యాపార పురోగతిపై అడుగులు వేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. వివాహ సమస్యలు నుండి బయటపడతారు. కోర్టు సమస్యల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

మీన రాశి- మీన రాశి వారి గజకేసరి యోగం వల్ల వీరికి రాబోయే రోజులు అన్నీ కూడా బాగుంటాయి. సమాజంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీకు క్రమంగా మంచి సంబంధాలను పెoచుకోగలుగుతారు. రానున్న రోజుల్లో ఉద్యోగస్తులకు కూడా చాలా మేలు జరుగుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు నుండి విముక్తి పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు విహారయాత్రలుగా వెళతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. రావాల్సిన మొండిబకాయల నుండి డబ్బులు లభిస్తుంది. దీని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

తులారాశి- తులారాశి వారికి చంద్రుడు గురు గ్రహం కలయిక వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీ వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడుల్లో ఇది లాభదాయకంగా ఉంటుంది. దీని వల్ల మీరు పురోగతి సాధించగలుగుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సామాజిక సేవ పట్ల మీరు ఆసక్తిని చూపిస్తారు. రాబోయే రోజుల్లో అన్నీ కూడా లాభాలు రాయకంగా ఉంటాయి. మీ బంధువుల శుభకార్యాల నిమిత్తం మీ బంధువుల ఇళ్లను సందర్శిస్తారు. అంతేకాకుండా మీ కుటుంబంలో కూడా కొన్ని శుభవార్తలు వింటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల్లో చదువుకోవాలని కల నెరవేరుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif