Astrology: నవంబర్ 15 కార్తీక పౌర్ణమి రోజున శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశం మూడు రాశుల వారికి అదృష్టం..
శని గ్రహం అనుగ్రహం వల్ల అనేక లాభాలు పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజున అంటే నవంబర్ 15వ తేదీన శనిగ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి.
శనిగ్రహం కూడా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటాడు. శని గ్రహం అనుగ్రహం వల్ల అనేక లాభాలు పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజున అంటే నవంబర్ 15వ తేదీన శనిగ్రహం రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి- వృషభ రాశి వారికి కార్తీక పౌర్ణమి రోజు నుంచి అనేక లాభాలు ఉంటాయి. వీరికి ప్రత్యక్షంగా ,ప్రారక్షంగా కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరు చేసే వ్యాపారంలో లాభాల బాట పడుతుంది. ఎప్పటినుంచ ఇబ్బంది పడుతున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కార్యాలయాల్లో కొనసాగుతున్న ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణము ఏర్పడుతుంది. ఏ పని చేసినా కూడా బాధ్యతాయుతంగా దాన్ని పూర్తి చేస్తారు మీ శక్తి సామర్థ్యాలతో అందరి మన్ననలు పొందుతారు. దీని వల్ల మీకు మానసికంగా దృఢత్వం పెరుగుతుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి శని గ్రహ సంచారం కారణంగా అనేక లాభాలు ఉంటాయి. వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులను చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల వీరికి పోటీ పరీక్షల్లో మొదటి ర్యాంకు వస్తుంది. ఇది తల్లిదండ్రుల్లో సంతోషాన్ని నింపుతుంది. రాబోయే రోజుల్లో వీరికి అన్ని లాభదాయకంగా ఉంటాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి మిమ్మల్ని ఇష్టపడే వారిని కలవడానికి సమయం దొరుకుతుంది. ప్రమోషన్ల కోసం ఆఫర్లు వస్తాయి. ఇది ఉద్యోగస్తులకు చాలా మంచి సమయం మీకు బోనస్తులు లభిస్తాయి.
సింహరాశి- సింహ రాశి వారికి కార్తీక పౌర్ణమి రోజు నుండి అనేక శుభ ఫలితాలు లభిస్తాయి. భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే అది కార్యరూపం దాలుస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సామాజికంగా గుర్తింపు పొందుతారు. ప్రేమ విషయాలలో కుటుంబ సభ్యుల నుండి అనుకూలం లభిస్తుంది. విద్యార్థులు చదువులో విజయాన్ని సాధిస్తారు. మునపటి కంటే మెరుగైన ఆలోచనలతో జీవితంలో ముందుకు వెళతారు. వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. అవి లాభదాయకంగా ఉంటాయి. ఏ పని ప్రారంభించాలి అనుకున్న కూడా మీరు తీసుకునే నిర్ణయము వల్ల అన్ని సత్ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.