Astrology: సెప్టెంబర్ 24న వృశ్చిక రాశిలోకి బుధుడు సంచారం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
వ్యాపారానికి, మేధస్సుకు, వినోదానికి ,లాభనష్టాలకు శాసించే గ్రహం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వ్యాపారానికి, మేధస్సుకు, వినోదానికి ,లాభనష్టాలకు శాసించే గ్రహం. ఈ బుధ గ్రహం సెప్టెంబర్ 24న కన్యా రాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి- బుధ గ్రహం రాశి సంచారం కారణంగా ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయ వనరుల అవకాశాలు పెరుగుతాయి. మీ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త కస్టమర్లు వస్తారు. దీని ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా మీ జీతం రెట్టింపు అవుతుంది. మీరు పని చేసే చోట ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనాన్ని కొనుక్కోవాలని ఆలోచన విజయవంతం అవుతుంది.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది
మీన రాశి- ఈ రాశి వారికి ధైర్యము ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండడం ద్వారా చేసే ప్రతి పనిలో కూడా ముందుకు వెళతారు. మీరు పని చేసే చోట మీ స్పష్టత తెలుస్తుంది. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉంటాయి. వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. మీరు స్వార్థం లేకుండా ఉండడం ద్వారా ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. దీని ద్వారా మీరు లాభాలు పెరుగుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. పనిచేసే ప్రదేశంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైన వస్తువులను బహుమతిగా పొందుతారు. మీ జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం. విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో ఉత్తీర్ణతలు అవుతారు.
మేషరాశి- ఈ రాశి వారికి కోరుకున్న విధంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మార్కెటింగ్ రంగాల్లో మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార ప్రకటనలకు అవకాశాలు ఏర్పడతాయి. దీని ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ప్రతి పనిలో మీ భార్య నుండి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారంలో స్థిరమైన లాభాలు కొనసాగుతూ ఉంటాయి. కొత్త కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెరీర్లో ముందుకు వెళ్లడానికి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. దీని ద్వారా మీరు మీ కెరీర్ లో విజయాన్ని పొందుతారు సామాజికంగా ప్రతిష్టను పెంచుకుంటారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.