Astrology: సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
ఇది అక్టోబర్ 13 వరకు తులా రాశిలో ఉంటుంది. శుక్ర గ్రహం సంపదకు కీర్తికి ఆనందాన్ని ఇచ్చే ఒక గ్రహం. శుక్ర గ్రహం ఒక సంవత్సరం తర్వాత తులారాశిలోకి సెప్టెంబర్ 26న ప్రవేశించబోతుంది.
సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం. ఇది అక్టోబర్ 13 వరకు తులా రాశిలో ఉంటుంది. శుక్ర గ్రహం సంపదకు కీర్తికి ఆనందాన్ని ఇచ్చే ఒక గ్రహం. శుక్ర గ్రహం ఒక సంవత్సరం తర్వాత తులారాశిలోకి సెప్టెంబర్ 26న ప్రవేశించబోతుంది. శుక్ర సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి- శుక్ర సంచారం కారణంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం. మీరు ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాన్ని విదేశాల్లో విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం. విద్యార్థులు తమకేరిలో ఉన్నత శిఖరాలకు చేరుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
మేషరాశి- ఈ రాశి వారికి శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. మానసిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పాత స్నేహితులు కలుస్తారు. సంపద పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు మధ్య ఎప్పటినుంచో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. దీని ద్వారా మానసిక సమస్యలు మీకు తొలగిపోతాయి.
Astrology: శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఇష్టమైన 4 రాశులు ఇవే
వృశ్చిక రాశి- తులారాశిలోకి శుక్రు గ్రహం ప్రవేశం కారణంగా ఈ రాశి వారికి చాలా ఆర్థిక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. మీ జీవితంలో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి. అవి మీకు సంతోషాన్ని ఇస్తాయి. జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడతారు. భవిష్యత్తు మీకు శుభకరంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం వస్తుంది. దీని ద్వారా మీరు విలాసాలను అనుభవిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. మీరు కోరుకున్నచోట బదిలీ అవుతుంది. విహారయాత్రలకు వెళతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.