Astrology: అక్టోబర్ 6 ఆదివారం బుధుడు చిత్తా నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
వ్యాపారానికి శుభాలకు అధిపతి అయిన బుధుడు అక్టోబర్ 6 ఆదివారం రోజు రాత్రి 11 గంటలకు చిత్తా నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. వ్యాపారానికి శుభాలకు అధిపతి అయిన బుధుడు అక్టోబర్ 6 ఆదివారం రోజు రాత్రి 11 గంటలకు చిత్తా నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి సానుకూల మార్పులు ఉంటాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి: కన్య రాశి చెందినవారు బుధ గ్రహం నక్షత్రం మార్పు కారణంగా అనేక విధాలుగా లాభపడతారు. పనిచేసే చోట వీరికి గౌరవం పెరుగుతుంది. జీవితంలో ఇంక్రిమెంట్లో పొందుతారు. పదోన్నతి పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ వ్యాపారంలో కొత్త కస్టమర్లు వస్తారు వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయోజనాలు లాభాన్ని ఇస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడులతో మీ పరిశ్రమల్లో లాభాలు అధికంగా ఉంటాయి. మొండి బకాయిల నుండి బయటపడతారు. ఆకస్మికంగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబ పరంగా అన్ని విధాలుగా ఆనందంగా ఉంటారు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
మేష రాశి: మేష రాశి వారికి బుధ గ్రహం చిత్తా నక్షత్రంలోనికి ప్రవేశం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనాలు పొందుతారు. మీరు పని చేసే చోట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. మీరు వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది దీని వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
తులారాశి: తుల రాశి వారికి బుధ గ్రహం రాశి మార్పు కారణంగా వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. మీరు చేపట్టే ప్రతి పనిని కూడా విజయవంతంగా సాధిస్తారు. మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో మీ లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది ఆఫీస్ లో మీ ప్రతిభను నిరూపించుకుంటారు కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు కోర్టు సమస్యల నుండి బయటపడతారు. ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. దీని ద్వారా మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.