Astrology: సెప్టెంబర్ 3 న బుధుడు, శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల రాజయోగం..ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.

భద్ర యోగం, మాలవ్య యోగం, శేషయోగం

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 3 న బుధుడు, శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల శక్తివంతమైన మూడు రాజ యోగాలు ఏర్పడతాయి. భద్ర యోగం, మాలవ్య యోగం, శేషయోగం ఈ మూడు యోగాల కలయిక వల్ల ఈ ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ ఐదు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి:  కర్కాటక రాశి వారికి ఈ మూడు రాజగ్రహాల కలయిక వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. మీ పెట్టుబడికి తగిన రాబడి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది శుభ సమయం దీనివల్ల మీ లాభాలు పెరుగుతాయి. అవి వాహతులకు వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న రుణ సమస్యల నుండి బయటపడతారు.

మేషరాశి: సెప్టెంబర్ 3న ఈ మూడు గ్రహాల కదలిక వల్ల ఈ రాశుల వారికి జీవితాలు పైన సానుకూల ప్రభావాన్ని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ డబ్బు రెట్టింపు అవుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. యువత కొత్త ఉద్యోగాలను పొందుతారు. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కొత్త కస్టమర్లు సంపాదించడం ద్వారా మీ వ్యాపారం విస్తరణ పెరుగుతుంది.

వృషభ రాశి: ఈ రాశి వారికి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు వస్తాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులను సాధిస్తారు. దీని వల్ల మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. నూతన వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశీ పర్యటనలకు అవకాశం ఎక్కువగా ఉంది.

Astrology: ధనలక్ష్మీ దేవికి ఇష్టమైన 4 రాశులు ఇవే

తులారాశి: ఈ రాశి వారికి బుధుడు, శుక్రుడు, శని మూడు గ్రహాల కలయిక వల్ల ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇదే శుభ సమయం విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి మీ భవిష్యత్తుని బంగారు బాట చేసుకుంటారు. కుటుంబంలో ఒక శుభవార్త వింటారు. మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదం పొందుతారు.

కన్యారాశి: ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి లాభాలు రెట్టింపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది శుభ సమయం. విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి కూడా మంచి అవకాశం మీ వ్యాపార ఆదాయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు కోర్టులో పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు .ఇది మీకు మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



సంబంధిత వార్తలు