Astrology: నవంబర్ 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం దీని కారణంగా మూడు రాశులు వారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి..

నవంబర్ 16వ తేదీన శనివారం ఉదయం 7 గంటలకు సూర్యుడు తన రాశి ని మార్చుకుంటున్నాడు .సూర్యగ్రహం తులా రాశి నుంచి బయటికి వచ్చి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది.

astrology

నవంబర్ 16వ తేదీన శనివారం ఉదయం 7 గంటలకు సూర్యుడు తన రాశి ని మార్చుకుంటున్నాడు .సూర్యగ్రహం తులా రాశి నుంచి బయటికి వచ్చి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మూడు రాశుల పైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా మూడు రాశులు వారికి సమస్యలు పెరుగుతాయి. వీరు కోర్టుల చుట్టూ ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి వస్తుంది. అంటే కాకుండా ధన నష్టము, ఆస్తి నష్టం వంటి నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి- మేషరాశిలో జన్మించిన వారికి సూర్యుని సంచారం కారణంగా కాస్త అసహనానికి గురవుతారు. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం సహనం కోల్పోవడం వంటి ఏర్పడతాయి. మానసిక ఒత్తిడి అశాంతి కూడా అనిపిస్తుంది. ఉద్యోగస్తులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసే పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. ఆదాయపరంగా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారాలలో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారా నష్టపోయే అవకాశం ఎక్కువ నిలిచిపోయిన పనులు మరింతగా ఆలస్యం అయ్యే అవకాశం. కుటుంబ సభ్యులతో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం క్షేనించే అవకాశం.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి, 

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి సూర్యుడు సంచారం కారణంగా ఆందోళన నిరాశ పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీనికి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. వీరు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. వ్యాపార పరంగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీపై అధికారుల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీకు వచ్చే డబ్బులు కాస్త ఆలస్యం అవుతాయి. ఉద్యమం కోల్పోయిన ప్రమాదం కూడా ఉంటుంది. కొత్త ఉద్యోగం దొరకడానికి చాలా సమయం కూడా పడుతుంది. వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంది పోటీదారుల నుండి గట్టి పోటీ ఉండడం ద్వారా మీ వ్యాపారం దెబ్బతింటుంది. కాళ్ల నొప్పులు కండరాల నొప్పులు వంటివి ఏర్పడతాయి.

సింహరాశి- సింహ రాశి వారికి సూర్యుడు సంచారం కారణంగా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో మీ సీనియర్లతోటి గొడవల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం నుండి డబ్బులు సంపాదించే ప్రయత్నంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆదాయం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. జీవితంలో కష్టాలు పెరుగుతాయి వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కెరియర్ పైన అడ్డంకులు ఏర్పడతాయి. కస్టమర్లతో వివాదాలు ఏర్పడడం వల్ల మీ వ్యాపార సంబంధాలు వైఫల్యం అవుతాయి. ప్రయాణాల్లో సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దూర ప్రయాణాలకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. గుండె సమస్యలు అధిక రక్తపోటు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif