Astrology : ఇంట్లో తులసిమొక్క కు సరైన స్థలం ఏమిటి, ఈ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు..

అని చాలామంది అంటారు. జ్యోతిష శాస్త్రంలో ,హిందూమతంలో తులసి మొక్కకు ఒక ప్రాధాన్యత ఉన్నది.

astrology

తులసి మొక్క ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అనేక మంచి ఫలితాలు లభిస్తాయి. అని చాలామంది అంటారు. జ్యోతిష శాస్త్రంలో ,హిందూమతంలో తులసి మొక్కకు ఒక ప్రాధాన్యత ఉన్నది. తులసి మొక్క మన ఇంట్లో ఒక సానుకూల శక్తిని ,ఆనందాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అయితే ఇంట్లో తులసి మొక్కను ఎక్కడ ఎటువంటి ప్రదేశాల్లో ఉంచకూడదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటువంటి ప్రదేశాల్లో తులసి మొక్కను ఉంచడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వాస్తు దోషాలు కూడా ఏర్పడతాయి. తులసి మొక్కను ఎటువంటి ప్రదేశంలో పెట్టకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చీకటి ప్రదేశాల్లో పెట్టకూడదు- తులసి మొక్కను ఎల్లప్పుడూ కూడా ఇంట్లో చీకటి ప్రదేశాల్లో అసలు పెట్టకూడదు. తులసి మొక్కను ఎప్పుడూ కూడా బయట సూర్య రష్మి తగిలే విధంగా ఉంచాలి. కిటికీలు లేని స్టోర్ రూమ్ లో వంటి గదిలో చీకటి ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. దీనివల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి తులసి మొక్కను ఎప్పుడూ కూడా ప్రకాశవంతమైన ప్రదేశంలో మాత్రమే పెంచాలి.

Vastu Tips: నల్లచీమలు ఇంట్లో కనిపిస్తే మంచిదేనా,

దక్షిణ దిశలో ఉంచకూడదు- తులసి మొక్కను ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో నాటకూడదు. దీనివల్ల ఇంట్లో అశుభకారాలు జరుగుతాయి. ఈశాన్య దిశలో నాటడం చాలా మంచిది. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

తులసి మొక్కను కుండీలో ఉంచకూడదు- తులసి మొక్కలు ఎప్పుడు కూడా కుండీలో మట్టిలో ఉంచకూడదు. ఇది ఎప్పుడు కూడా భూమిలో నాటాలి సహజంగా గాలి ,కాంతి, తగిలే విధంగా దీనికి ఉండాలి. కుండీలో ఉంచడం ద్వారా అంతా మంచి ఫలితాలను ఇవ్వదు.

వినాయకుడి విగ్రహం ముందు పెట్టకూడదు- వినాయకుడి విగ్రహం ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మొక్కను పెట్టకూడదు. వినాయకుని విగ్రహం ముందు పెట్టినట్లయితే ఇంట్లో అంత శుభ ఫలితాలు లభించవు. సానుకూల శక్తి కూడా ఉండదు. దీనివల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది..

ఇంటి పైన పెట్టకూడదు- చాలామంది ఇళ్లల్లో తులసి మొక్కను ఇంటి పైకప్పులో పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వాస్తు ప్రకారం అంత మంచిది కాదు. దీనివల్ల ఆ కుటుంబంలో నెగిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ అవుతుంది. టెర్రస్ మీద ఇంటి పైకప్పులో తులసి మొక్కను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.