Diwali Astrology: నవంబర్ 1 దీపావళి రోజు బుధుడు, శని అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

ఒక్కొక్కసారి ఈ రాశి మార్పు కారణంగా 12 రాశుల పైన ప్రభావితం చూపిస్తాయి. కొన్నిసార్లు శుభ ఫలితాలు కొన్నిసార్లు అశుభ ఫలితాలు చూపిస్తూ ఉంటాయి.

astrology

జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ రాశి మార్పు కారణంగా 12 రాశుల పైన ప్రభావితం చూపిస్తాయి. కొన్నిసార్లు శుభ ఫలితాలు కొన్నిసార్లు అశుభ ఫలితాలు చూపిస్తూ ఉంటాయి. అయితే ఈసారి దీపావళి నవంబర్ 1వ తేదీన బుధుడు ,శనిగ్రహం రెండు కూడా అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాయి. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశుల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి- మేషరాశి వారికి బుధుడు, శని సంచారం వల్ల అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. దీపావళి నుండి వీరిలో ఆర్థికపరమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి జీతాలు పెరుగుతాయి. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి వచ్చే సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో ఏకాంతంగా సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడికి ఇది అనుకూలమైన సమయం భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మొదటి ర్యాంకు వస్తుంది. దీంతో తల్లిదండ్రులు ఆనందపడతారు.

Vastu Tips: వ్యాపారంలో నష్టం తట్టుకోలేక పోతున్నారా, 

కర్కాటక రాశి- కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ నవంబర్ 1 దీపావళి నుండి వీరి జీవితంలో అనూహ్య మార్పులు వస్తాయి. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మికంగా ఆదాయం వనరులు వస్తాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. వీరు పని చేసే చోట ప్రశంసలు అందుకుంటారు. మీ పని పట్ల మీ బాస్ సంతోషంగా ఉంటారు. ప్రమోషన్ వల్ల మీ జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారానికి కూడా ఇది మంచి సమయం. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వీటివల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది .ఖర్చులు తగ్గుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి శని బుధుడి అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం. కారణంగా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. మీ సహ ఉద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అది మీ పురోగతికి తోడ్పడుతుంది పూర్వికులు నుండి రావాల్సిన ఆస్తి లభిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడేందుకు మీకు ఆర్థిక లాభాలు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. జీతం రెట్టింపు అవుతుంది. కోర్టు సమస్యల నుండి బయటపడతారు. ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.