Dussehra 2021 Wishes: దసరా పండగ శుభాకాంక్షలు, బంధు మిత్రులకు ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండి, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్, వాట్సప్ మెసేజ్‌స్ మీకోసం
మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు.
చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Dussehra 2021) అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.
చరిత్ర ప్రకారం విజయదశమి (Happy Dussehra) రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.
బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పదునేనమిది చేతులను కలిగి ఉంది.
ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది.
ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరు. చివరకు మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది. అదే విజయదశమి కూడా.
ఈ విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజిస్తారు.
లేటెస్ట్‌లీ తరపున అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ మిత్రులకు, బంధువులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు (Happy Dussehra 2020 Wishes) తెలియజేయండి.
1. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు,
2. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
3. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ విజయదశమి ఎనలేని విజయాల్ని అందించాలాని కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు
4. మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికి దసరా పండగ శుభాకాంక్షలు
5. చల్లని దుర్గమ్మ ఆశీస్సులతో అన్ని సమస్యలు తీరిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
6. ఈ దసరా ఆయురారోగ్యాలను విజయాలను అందిచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
7.ఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని, మీ ఇంట సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.
8. చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు
9. విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు
10.జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ దసరా మరియు విజయ దశమి శుభాకాంక్షలు
11. ఈ దసరా మీ జీవితాల్లో విజయ దుందుభి మోగించాలని, ఆ దుర్గామాత కటాక్షం ఎల్లవేళలా అందరి పై ఉండాలని కోరుకుంటూ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
12. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి.ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలపై విజయం సాధించడమే విజయదశమి అంతరార్థం. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!
13. దుర్గామాత ఆశీస్సులతో.. అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
14. చెడుపై మంచి విజయం సాధించిన రోజు...దుర్గామత రాక్షుసుడిని మట్టుబెట్టిన రోజు. రావణుడిని రాముడు సంహరించిన రోజు...అందుకే దసరా అంటే మనకు ప్రత్యేకమైన రోజు.. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు