దేవీ నవరాత్రులు వచ్చేశాయి. ఆ దుర్గాదేవీ 9 రోజులపాటు రాక్షసులను వెంటాడి సంహరించిన రోజులివి. అందుకే మనం దీన్ని దేవీ నవరాత్రులుగా తొమ్మిది రోజులపాటు వేడుకలు జరుపుకుంటున్నాం. పదో రోజున రాక్షసులపై విజయం సాధించినందుకు విజయదశమి (Happy Dussehra 2020) పండుగ నిర్వహిస్తున్నాం. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Vijayadashami) అని పిలుస్తారు.
మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించు కునుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.
పది తలల రావణాసురుడిపై రాముడు విజయం సాధించిన రోజు ఇదేనని, అందుకే ఈ రోజును ‘దస్ హరా’ అని జరుపుతున్నారని కూడా అంటారు. తొమ్మిది రోజుల నవరాత్రి పూజతో పునీతుడై జీవుడు దశమి తిథి పూజతో విద్యాశక్తి అనుగ్రహాన్ని పొందుతాడని పురాణాలు పేర్కొంటున్నాయి.
అదే విజయదశమి పూజ.విజయాలకు కారకమైన దశమి విజయదశమి. విజయుడు (అర్జునుడు) విరాటరాజు కొలువులో ఉండి కౌరవ సేనలను ఓడించి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన రోజు కాబట్టి విజయ దశమి (Happy Dussehra 2020, Images, Quotes, Wishes) అయ్యిందని కూడా అంటారు. ఏది ఏమైనా చెడుపై మంచి విజయం సాధించిన రోజు.
లేటెస్ట్‌లీ తరపున అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ మిత్రులకు, బంధువులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు (Happy Dussehra 2020 Wishes) తెలియజేయండి.
1. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు,
2. మీకు మీ కుటుంబ షభ్యలుకు దసరా శుభాకాంక్షలు
3. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ విజయదశమి ఎనలేని విజయాల్ని అందిచాలాని కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు
4. మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికి దసరా పండగ శుభాకాంక్షలు
5. చల్లని దుర్గమ్మ ఆశీస్సులతో అన్ని సమస్యలు తీరిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
6. ఈ దసరా ఆయురారోగ్యాలను విజయాలను అందిచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
7.ఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని, మీ ఇంట సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.
8. చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు
9. విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు
10.జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ దసరా మరియు విజయ దశమి శుభాకాంక్షలు
11. ఈ దసరా మీ జీవితాల్లో విజయ దుందుభి మోగించాలని, ఆ దుర్గామాత కటాక్షం ఎల్లవేళలా అందరి పై ఉండాలని కోరుకుంటూ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
12. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి.ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలపై విజయం సాధించడమే విజయదశమి అంతరార్థం. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!
13. దుర్గామాత ఆశీస్సులతో.. అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు
దసరా శుభాకాంక్షలు
14. చెడుపై మంచి విజయం సాధించిన రోజు...దుర్గామత రాక్షుసుడిని మట్టుబెట్టిన రోజు. రావణుడిని రాముడు సంహరించిన రోజు...అందుకే దసరా అంటే మనకు ప్రత్యేకమైన రోజు.. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు