International Friendship Day Wishes: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం,స్నేహితులకు పంపే ఫన్నీ సూక్తులు, అద్భుతమైన కొటేషన్లు మీకోసం. స్నేహితుల దినోత్సవం విలువను తెలియజేసే అద్భుతమైన ఈ సూక్తులను ఓ సారి తప్పక చదవండి
స్నేహం (Friendship) అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు.
స్నేహితుల దినోత్సవం (Happy Friendship 2022) అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, విందులు చేసుకోవడంగా కాకుండా స్నేహం, శాంతి పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఆ నెలను అంతర్జాతీయ స్నేహితుల మాసంగా ప్రకటించింది.ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు (Friend) అంటారు. స్నేహం (Friendship) అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం 2020, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, పూర్తి కథనం మీకోసం
మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా తమ కష్ట సుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం.
ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించుకుంటారు. దటీజ్ ఫ్రెండ్‌షిప్ డే (Happy world Friendship day).
స్నేహితులకు పంపే అధ్బుతమైన కొటేషన్లు (Friendship Day 2020 Wishes)
1. ఎదుటి వాడిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు
2, మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తే నిజమైన స్నేహితుడు
3. స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉంకూడదు
4. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం
5. ప్రతీ రోజు మాట్లాడుకోకున్నా అవసరమైనప్పుడు మనకు ధైర్యం, ఓదార్పు చెప్పే వాడే మన నేస్తం
6. నిజమైన స్నేహితుడు కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉంటాడు
7. కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతోనే చెప్పుకుంటాం
8. స్నేహం చేయడం మీ బలహీనత అయితే ప్రపంచంలో మీ అంత బలవంతుడెవరూ ఉండరు
9.స్నేహం కోసం ప్రాణమివ్వడం గొప్ప కాదు, అంతటి త్యాగం చేసే స్నేహితుణ్ని పొందడమే కష్టం
10. నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా.. నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న
11. నీ మీద నీకే నమ్మకంలేని సమయంలో నిన్ను నమ్మి నీ వెంట నడిచేవాడే నీ మిత్రుడు
12. వంద మంది స్నేహితులు ఉండటం గొప్పకాదు.. వంద సమస్యలు తీర్చే ఒక్క మిత్రుడు ఉండటం గొప్ప
13. నువ్వు చేసిన తప్పులను నీ ముఖం మీద చెప్పి సరిచేసేవాడే నిజమైన స్నేహితుడు
14. నేస్తమా అని పలకరించే హృదయం నీకుంటే.. నీ నేస్తానికి చిరకాలం నేను తోడుంటా..
స్నేహితులకు పంపే ఫన్నీ కొటేషన్స్
1. ఒకే మెసేజ్‌ను సిగ్గు లేకుండా వందసార్లు ఎవరికైనా పంపిస్తామంటే అది స్నేహితులకే.
2. ఫ్రెండ్‌షిప్ అంటే ప్యాంట్‌లో పోసే యూరిన్ లాంటిది. అందరూ దాన్ని చూస్తారు. కానీ ఆ వెచ్చదనం మాత్రం మీకే తెలుస్తుంది.
3. అప్పు తీసుకోనంత వరకు స్నేహం అందంగా ఉంటుంది. గొప్పగా అనిపిస్తుంది. నమ్మకంగా, స్థిరంగా ఉంటుంది
4. ఫ్రెండ్ చేతిలో చాక్లెట్ చూడనంత వరకు..ఈ లోకంలో స్నేహాన్ని మించింది మరొకటి లేదు
5. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు కింద పడితే నిన్ను పైకి లేపేది నేనే. (నేను నవ్వడం పూర్తయిన తర్వాత).
6. సముద్రంలో అలల్లా ఎంతో మంది స్నేహితులు వస్తుంటారు, పోతుంటారు. కానీ నిజమైన స్నేహితుడు మాత్రం మీ ముఖంపై ఆక్టోపస్ లాంటోడు. ఎంత వదిలించుకోవాలంటే అంత బలంగా పట్టుకుంటాడు